Manchu Lakshmi : షూ సాక్స్ కొనడానికి అమెరికా వెళ్తా… లక్ష్మక్క రేంజ్ వేరు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మంచు లక్ష్మి( Manchu Lakshmi ) కూడా ఒకరు ఈమె లేడీ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో కీలక పాత్రలలో నటించి మెప్పించారు.అయితే ప్రస్తుతం ఏమి బాలీవుడ్ ( Bollywood )ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకోవడం కోసం ముంబైలోనే స్థిరపడ్డారు.

 Latest News About Manchu Lakshmi-TeluguStop.com

ఇక ఇటీవల కాలంలో మంచు లక్ష్మి పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్యక్రమాలలో సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్నటువంటి మంచు లక్ష్మి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తాను హైదరాబాద్ నుంచి ముంబై రావడానికి గల కారణాలను కూడా ఈ సందర్భంగా మంచు లక్ష్మి తెలియజేశారు.తన కూతురికి నేను ఏదైనా చేయాలి అనుకుంటే ఇదే కరెక్ట్ సమయం అని అందుకే తాను ముంబై వచ్చి తన కూతురు కావలసినటువంటి అన్ని అవసరాలను తీరుస్తున్నానని తెలిపారు.

ఇక ముంబైలో చదువుకోసమే తాము ఇక్కడికి వచ్చావని తెలిపారు. హైదరాబాద్ నుంచి ముంబైకి పెద్దగా దూరం కాదని ఒక గంటలో ప్రయాణమైతే వెళ్లిపోవచ్చు కానీ తన కూతురు చదువులని పూర్తయిన తర్వాత తిరిగి తాను హైదరాబాద్ వెళ్ళిపోతాను అని తెలిపారు.

ఇక ఈమె మేకప్ షాపింగ్ గురించి కూడా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.తాను షూ లేదా సాక్స్ కొనాలంటే కచ్చితంగా అమెరికా( America ) వెళ్లినప్పుడే కొంటానని ప్రతి సంవత్సరం ఒక్కసారి తాను అమెరికాకు వెళ్తానని అప్పుడే తనకు కావలసినటువంటి అన్ని కూడా అక్కడే తెచ్చుకుంటాను అంటూ ఈమె కామెంట్ చేశారు.ఇలా షూ సాక్స్ అమెరికాలో కొట్టాను అంటూ మంచు లక్ష్మి తెలియచేయడంతో లక్ష్మక్క రేంజ్ వేరు షూ సాంగ్స్ ల కోసం అమెరికా వెళ్లడం అంటే మామూలు విషయం కాదు కదా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇక మీరు మీ అమ్మానాన్నలకు ఏదైనా గిఫ్ట్ ఇస్తారా అంటే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తప్పకుండా మా నాన్న కోసం నగలు గిఫ్టుగా తీసుకువస్తానని తెలిపారు.నాన్నకు నగలు అంటే చాలా ఇష్టం అని ముఖ్యంగా తన చేతికి ఒక పెద్ద కడియం ఉంటుంది అలాంటి వాటిని వేసుకోవడం నాన్నకు చాలా ఇష్టం అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా నాన్న కోసం నగలు తీసుకువస్తాను ఈ విషయంపై మా అమ్మ చాలా ఫీల్ అవుతుందని మంచు లక్ష్మి తెలిపారు .నాన్నకు నగలు తెస్తే నాన్న వేసుకుంటారు కానీ అమ్మకు తెస్తే మాత్రం సాయంత్రానికి ఆ నగలు ఎక్కడ పెడుతుందో కూడా మర్చిపోతుందని మంచు లక్ష్మి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=5SVze0&v=2815829492089171
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube