యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్( Salaar )’ మరో మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ మరియు కర్ణాటక ప్రాంతాలలో మొదలు అయ్యాయి.
టిక్కెట్లు హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి.ఇతర ప్రాంతాలలోనే ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ అంటే ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఊహించుకోవచ్చు.
ఈరోజే నైజాం ప్రాంతం లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవుతాయి.ఇక ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ జీవో కోసం మూవీ టీం ఎదురు చూస్తుంది.
ఓవర్సీస్ కి KDM లు కూడా డెలివరీ అయిపోయాయి.సరిగ్గా 22 వ తారీఖు 12:22 నిమిషాల ఇండియన్ స్టాండర్డ్ టైం లో సలార్ KDM అన్ లాక్ అవుతుందని మేకర్స్ చెప్పుకొచ్చారు.

నార్త్ అమెరికా కి సంబంధించిన ప్రీమియర్ షో అడ్వాన్స్ బుకింగ్స్ 1 మిలియన్ మార్కుకి అతి చేరువలో ఉంది.షోస్ ఇంకా పెంచితే కచ్చితంగా ‘అజ్ఞాతవాసి‘ ప్రీమియర్ షో రికార్డు గ్రాస్ ని కొడుతుందని అంటున్నారు.సుమారుగా 5 ఏళ్ళ నుండి రాజమౌళి సినిమాలు మినహా ఇప్పటి వరకు అజ్ఞాతవాసి ప్రీమియర్ షోస్ రికార్డ్స్ ని ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు.ఇప్పుడు సలార్ బ్రేక్ చేస్తే ఒక చరిత్ర సృష్టించినట్టు అవుతుంది.
ఇకపోతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెడుతున్నారు.ముఖ్యంగా హిందీ లో ఈ చిత్రం గట్టెక్కాలి అంటే దాదాపుగా 200 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు, 150 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి.
సోలో రిలీజ్ అయ్యుంటే ఇది చాలా తక్కువ టార్గెట్ అనుకోవచ్చు.కానీ ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘డుంకీ’ చిత్రం ( Dunki )ఉంది.

వరుసగా రెండు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాలు తర్వాత షారుఖ్ ఖాన్ నుండి విడుదల అవుతున్న సినిమా ఇది.ఈ చిత్రం మీద కూడా ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.డుంకీ చిత్రానికి ఫ్లాప్ టాక్ వస్తే కానీ, సలార్ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమని అక్కడి ట్రేడ్ పండితులు చెప్తున్నారు.ఇక రెండు తెలుగు రాష్ట్రాలు , కర్ణాటక, కేరళ మరియు ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి దాదాపుగా 550 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా 600 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి.మరి ఆ రేంజ్ మార్కుని అందుకుంటుందా లేదా అనేది చూడాలి.