బుల్లితెరపై యాంకరింగ్ రంగంలో దూసుకుపోతున్న సుమ, శ్రీముఖి వంటి వారిలో రష్మి గౌతమ్(Rashmi Gautam) కూడా ఒకరు.ఈమె మొదట్లో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు.
కానీ ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ (Jabardasth) ద్వారా ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.అయితే యాంకర్ గా( Anchor ) పేరు వచ్చాక రష్మీకి చాలా సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు కూడా వెల్లువెత్తాయి.
అలా ఓవైపు సినిమాలు మరోవైపు యాంకరింగ్ లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే చాలాసార్లు పెళ్లి చేసేసారు మల్లెమాల యూనిట్.మరీ ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్ సుధీర్ కి రష్మీకి మధ్య ఏదో నడుస్తోందని ఈటీవీలో ప్రసారమయ్యే చాలా షోలలో, ఈవెంట్లో వీరిద్దరికి పెళ్లి చేశారు.

ఇక బుల్లితెర మీద చాలామంది కి ఫేవరెట్ జోడీగా సుధీర్ (Sudheer) రష్మీ పేరు తెచ్చుకున్నారు.అయితే మా మధ్య అలాంటి రిలేషన్ ఏమీ లేదు కానీ మేము స్క్రీన్ వరకే అలా నటిస్తామని ఇప్పటికే చాలాసార్లు రష్మీ, సుధీర్ బయట పెట్టారు.ఇక గత కొన్ని రోజుల నుండి రష్మి గౌతమ్ పెళ్లి(Rashmi Gautam Marriage) చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తన పెళ్లి వార్తలు విని విని విసిగిపోయిన రష్మి గౌతమ్ తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు ఇయర్ ఎండింగ్లో చాలా చానల్స్ కొన్ని ఈవెంట్లను చేస్తారు.

అలా ఈసారి “రష్మీ పెళ్లి పార్టీ”(Rashmi Pelli Party) పేరుతో ఒక ఈవెంట్ చేస్తున్నారు.అయితే ఈ ఈవెంట్ లో రష్మి తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతుందని, తనకి కాబోయే భర్తకు సంబంధించిన విషయం ఈ షోలో బయట పెట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా రష్మీ పెళ్లి పార్టీకి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది.
దీంతో రష్మీ పెళ్లి చేసుకోబోయేది ఎవరిని.నిజంగానే రష్మీ ఆ షో లో తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పబోతుందా.
లేక ఎప్పటిలాగే అందరు ఆ షో చూడడం కోసం అలా రష్మీ (Rashmi) పెళ్లి అని ప్రచారం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.







