బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోకు పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) విన్నర్ కావడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
బిగ్ బాస్ షోలో సామాన్యుడు విజేతగా నిలవడం చరిత్రలో ఇదే తొలిసారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అయితే పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ శివాజీ వల్లే బిగ్ బాస్ విజేతగా నిలిచానని ఆయనే ధైర్యం చెప్పారని చెప్పుకొచ్చారు.

పల్లవి ప్రశాంత్ కు బిగ్ బాస్ షోకు విజేతగా నిలవడం సంతోషం కలిగించింది.నాగార్జున( Nagarjuna ) గారు నా చెయ్యి ఎత్తిన సమయంలో చాలా ఆనందంగా అనిపించిందని నేనే బిగ్ బాస్ విజేతగా నిలిచానా అని ఫీలయ్యానని ప్రశాంత్ పేర్కొన్నారు.ఇది నా విజయం మాత్రమే కాదని నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరి విజయమని పల్లవి ప్రశాంత్ కామెంట్లు చేశారు.రతిక బయటినుంచి పాయింట్ తీసుకొచ్చి నన్ను నామినేట్ చేసిందని ఆయన వెల్లడించారు.
మొదట రతిక( Rathika Rose ) అక్కా అని పిలవాలని కోరిందని పల్లవి ప్రశాంత్ అన్నారు.సరే అని పిలిచానని తర్వాత పిలవవద్దని కోరిందని పల్లవి ప్రశాంత్ అభిప్రాయపడ్డారు.
మనం ఒకసారి మనస్సులో అక్క అని ఫిక్స్ అయ్యి అలా పిలిస్తే ఆమె అక్కనే అవుతుందని పల్లవి ప్రశాంత్ కామెంట్లు చేశారు.శివాజీ అన్న నేను కామన్ మ్యాన్ గా వచ్చానని నేను గెలవాలని కోరుకున్నారని పల్లవి ప్రశాంత్ అన్నారు.

కామన్ మ్యాన్ పవర్ చూపించావని అన్న ప్రతిసారి నాకు ధైర్యం కలుగుతుందని పల్లవి ప్రశాంత్ వెల్లడించారు.పల్లవి ప్రశాంత్ భవిష్యత్తులో కెరీర్ పరంగా సంచలనాలను సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.పల్లవి ప్రశాంత్ సరైన దారిలో అడుగులు వేస్తే మాత్రం కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పవచ్చు.తాను విజేతగా నిలవడంలో శివాజీ సహకారం ఉందని పల్లవి ప్రశాంత్ చెప్పకనే చెప్పేశారు.








