యాదాద్రి భువనగిరి జిల్లా: బీసీ కుల గణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమల్ల కార్తీక్ గౌడ్ డిమాండ్ చేశారు.ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం మండల అధ్యక్షుడు కొప్పు రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ప్రగతి భవన్ పేరు తొలగించి మహాత్మ జ్యోతిరావు పూలే పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలన్నారు.బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ మహిళలకు, అధికారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కొత్త భాను,ఉపాధ్యక్షుడు కొల్లూరి నవీన్,యువజన నాయకులు శివ,బత్తిని అజయ్,మారసాని సాయి తదితరులు పాల్గొన్నారు.







