నటి సన ( Sana )… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాతకేల్లుగా సినిమా ఇండస్ట్రీలో నటిస్తూ ఎన్నో మంచి సినిమాల్లో కనిపించారు.నిన్నే పెళ్ళాడుతా సినిమాతో( Ninne Pelladatha ) టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సన ఆ తర్వాత ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతోనే కెరియర్ ను కొనసాగించారు.
సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే సమయంలో షూటింగ్ ఎలా ఉంటుందో అసలు నటన అంటే ఏంటో బొత్తిగా తెలియదని, ఏమాత్రం అవగాహన లేకుండా మొట్టమొదటి సినిమాలో నటించేసానని ఆ టైంలో తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అసలు వచ్చేది కాదంటూ తెలిపారు సన.

కానీ ఇండస్ట్రీస్ నాకు చాలా ఇచ్చింది ఈ సినిమా ఇండస్ట్రీలోనే అన్ని విషయాలు నేర్చుకున్నాను ఒక్కో కాంపౌండ్ లో ఒక్కో రకమైన జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాను.ఇప్పటికి నేను ఇక్కడ నిలదొక్కుకున్నాను అంటే అది కొంతమంది దర్శకులు మరియు నిర్మాతల వల్లే సాధ్యమైంది.ఏమీ తెలియని నాతో అన్ని సరిగ్గా చేయించుకున్నారు అలా ఒకటి తర్వాత ఒకటి సినిమాలు వచ్చాయి.
ఇప్పుడైతే తెలుగు బాగా మాట్లాడుతున్నాను కానీ చదవడం రాయడం అయితే నేర్చుకోలేకపోయాను.కెరియర్ కాస్త బిజీ అయ్యాక నేర్చుకుందాం లేకుంటే బిజీ అయ్యాక టైం ఏ మాత్రం దొరకపోవడంతో అలా అవి పక్కకు వెళ్లిపోయాయి.

ఎంతో కొంత నా జీవితం ఈరోజు ఇంత ఆనందకరంగా ఉంది అంటే దానికి కారణం దర్శకేంద్రుడికి రాఘవేంద్రరావు( Raghavendra Ra ) మాత్రమే అని, ఆయన అన్ని సినిమాల్లో తనకు అవకాశం ఇచ్చారని, ఇప్పటికీ ఆయన సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తున్నానని అందుకే ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు నటి సన.ఇక సనా కుటుంబంలో కూడా కొంతమంది నటులు ఉన్నారు ఆమె కొడుకు తమిళ్ లో సీరియల్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుండగా కోడలు సమీరా షరీఫ్ తెలుగులో ఒకప్పుడు సీరియల్లో నటించి ఆ తర్వాత హోస్ట్ గా కూడా పని చేసింది .







