శివాజీ పతనానికి అతని అహంకారమే కారణమా..? 96 సినిమాలు చేసినోడు ఒక సీరియల్ ఆర్టిస్ట్ ముందు ఓడిపోయాడు!

భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) ఎన్నో ఊహించని ట్విస్టులతో అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ తో మొత్తానికి సీజన్ ని పూర్తి చేసుకుంది.ఈ సీజన్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం ఎవరు అని అడిగితే ఒక అమర్ దీప్( Amardeep ) మరొకరి శివాజీ( Shivaji ) అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

 Bigg Boss Telugu 7 Grand Finale Shivaji Third Place Amardeep In Top 2 Details, B-TeluguStop.com

బోలెడంత కంటెంట్, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ తో పాటుగా, వేరే లెవెల్ ఎమోషన్స్ కూడా వీళ్లిద్దరి వల్లే పండాయి.ప్రోమోలు కూడా ఎక్కువ వీళ్లిద్దరి మీదనే ఉండేవి.

ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఈ సీజన్ కి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.నిన్ననే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసారు.

టాప్ 6 కంటెస్టెంట్స్ లో అర్జున్ , ప్రియాంక, యావర్ మరియు చివర్లో శివాజీ ఎలిమినేట్ అయ్యారు.చివరికి అమర్ మరియు ప్రశాంత్ మాత్రమే టాప్ 2 గా నిలిచారు.

Telugu Amardeep, Amardeep Top, Biggboss, Priyanka Jain, Shivaji, Shivaji Place,

వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది రేపటి ఎపిసోడ్ లో తెలియనుంది.ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేష్ బాబు( Mahesh Babu ) చేతుల మీదుగా పల్లవి ప్రశాంత్ ట్రోఫీ తీసుకుంటాడా?, లేకపోతే అమర్ దీప్ ట్రోఫీ తీసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.సోషల్ మీడియా లో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) గెలిచాడని అంటున్నారు.కానీ అది నిజం కాదు.టాప్ 2 లో విన్నర్ ఎవరు అనే ఎపిసోడ్ ని ఇంకా షూట్ చెయ్యలేదు.రేపు సాయంత్రం లైవ్ లో ఈ షూటింగ్ ని టెలికాస్ట్ చేస్తారు.

ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో మొదటి నుండి శివాజీ టైటిల్ గెలుచుకుంటాడు అని అందరూ అనుకున్నారు.కానీ శివాజీ అమర్ దీప్ ని విపరీతంగా టార్గెట్ చెయ్యడం వల్లే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.

చివరి ఎపిసోడ్స్ లో కూడా ఆయన అమర్ పై చేసిన కొన్ని కామెంట్స్ ప్రేక్షకులకు కోపం తెప్పించేలా చేసాయి.

Telugu Amardeep, Amardeep Top, Biggboss, Priyanka Jain, Shivaji, Shivaji Place,

మొన్నటి ఎపిసోడ్ లో జాతకం పేరుతో శివాజీ అమర్ ని చాలా వరకు తక్కువ చెయ్యాలని చూసాడు.కప్పు నీకు అర కిలోమీటర్ దూరం లో ఉందని, కానీ ఎలా అయినా కప్ దొంగలించుకొని పోగల సమర్థుడివి అంటూ కామెంట్ చేసాడు.అంటే అమర్ దీప్ కప్ గెలవడు, కనీసం టాప్ 5 లోకి కూడా రాడు అని శివాజీ బలమైన ఫీలింగ్.

అలా చులకనగా చూసిన ఆయన అమర్ కంటే ముందే ఎలిమినేట్ అవ్వడం, అమర్ అసలు సిసలు గెలుపు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఎంతో నెగటివిటీ ని( Negativity ) ఛేదించుకొని అమర్ కప్పు కి అర అంగుళం దూరం లో ఉన్నాడు అని, 96 సినిమాలు చేసిన ఒక వ్యక్తిని ఒక సీరియల్ ఆర్టిస్టుని ట్యాగ్ చేసి తన ఓటమిని కొని తెచ్చుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో అమర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube