కబ్జాకు పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేస్తాం: ఎన్ఎస్పి డిఈఈ అమరేందర్

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామ ఊర చెరువు శిఖం భూమిని కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేసి,కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ఎస్పి డిఈఈ అమరేందర్ అన్నారు.శుక్రవారం ఎన్ఎస్పి అధికారులు,చెరువు సొసైటీ సభ్యులతో కలిసి ఆయన పెంచికలదిన్నె ఊర చెరువును పరిశీలించారు.

 Cases Will Be Registered Against Those Involved In Encroachment Nsp Dee Amarende-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచికల్ దిన్నె గ్రామ ఊర చెరువు శిఖం భూమిపై కొందరు ఆక్రమణకు పాల్పడ్డారని,

వెంటనే ఆదేశాలు జారీ చేసే సర్వే జరిపించి, చెరువు కబ్జాకు పాల్పడుతున్న వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి ఏఈఈ రాజేశ్వరి,వర్క్ ఇన్స్పెక్టర్ రాము,లస్కర్ రాచూరి నాగేష్,సొసైటీ కమిటీ సభ్యులు ఇంజమూరి వెంకటయ్య, సిరికొండ నాగయ్య, యడవల్లి వెంకటకృష, యాగాని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube