కబ్జాకు పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేస్తాం: ఎన్ఎస్పి డిఈఈ అమరేందర్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామ ఊర చెరువు శిఖం భూమిని కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేసి,కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ఎస్పి డిఈఈ అమరేందర్ అన్నారు.
శుక్రవారం ఎన్ఎస్పి అధికారులు,చెరువు సొసైటీ సభ్యులతో కలిసి ఆయన పెంచికలదిన్నె ఊర చెరువును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచికల్ దిన్నె గ్రామ ఊర చెరువు శిఖం భూమిపై కొందరు ఆక్రమణకు పాల్పడ్డారని,
వెంటనే ఆదేశాలు జారీ చేసే సర్వే జరిపించి, చెరువు కబ్జాకు పాల్పడుతున్న వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి ఏఈఈ రాజేశ్వరి,వర్క్ ఇన్స్పెక్టర్ రాము,లస్కర్ రాచూరి నాగేష్,సొసైటీ కమిటీ సభ్యులు ఇంజమూరి వెంకటయ్య, సిరికొండ నాగయ్య, యడవల్లి వెంకటకృష, యాగాని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్‌లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిథ్యం ఉండాలి .. స్టాండింగ్ కమిటీ సిఫారసు