1980వ దశకంలో సిక్కు వేర్పాటు వాదం మనదేశంలో రక్తపుటేరులు పారించిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ మద్ధతుతో పంజాబ్‌కు చెందిన కొందరు సిక్కులు ప్రత్యేక ఖలిస్తాన్( Khalistan ) దేశాన్ని కోరుతూ మారణహోమం సృష్టించారు.
ఈ పరిణామాలు.ఆపరేషన్ బ్లూస్టార్, ప్రధాని ఇందిరా గాంధీ హత్య, సిక్కుల ఊచకోత, పంజాబ్‌లో హింసాత్మక పరిస్థితుల వరకు దారి తీశాయి.
తదనంతర కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేయడంతో పంజాబ్‌లో శాంతి నెలకొంది.అయితే ఆయా దేశాల్లో స్థిరపడిన సిక్కుల్లో( Sikhs ) వున్న కొందరు ఖలిస్తానీ అనుకూలవాదులు నేటికీ ‘‘ఖలిస్తాన్’’ కోసం పోరాడుతూనే వున్నారు.
ఈ ఏడాది మొదట్లో అమృత్‌పాల్ సింగ్ వ్యవహారం భారత్‌లో అలజడి సృష్టించింది.అచ్చుగుద్దినట్లు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను పోలీనట్లుగా వేషధారణ, ఉద్రేకపూరిత ప్రసంగాలతో అమృత్‌పాల్( Amritpal Singh ) సిక్కు యువతను రెచ్చగొట్టాడు.
తన అనుచరులను అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్‌పై వేలాదిమందితో దాడి చేసిన వారిని విడిపించుకుని తీసుకెళ్లాడు.ఇతని దూకుడుకు అడ్డుకట్ట వేయాలని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్ట్ చేసేందుకు యత్నించాయి.
అయితే పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని పారిపోయాడు అమృత్‌పాల్ .దీంతో అతనికి మద్ధతుగా కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల్లో సిక్కు వేర్పాటువాదులు హింసకు పాల్పడ్డారు.ఏకంగా భారత దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు.ఎట్టకేలకు రోజుల తర్వాత అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపింది కేంద్రం.
ఈ వ్యవహారం సద్దుమణిగిన తర్వాత కెనడాలో( Canada ) స్థిరపడిన ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య అమృత్‌పాల్‌ను మించి అలజడి రేపింది.నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం వుందని సాక్షాత్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలతో ఖలిస్తాన్ గ్రూపులు, సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.నిజ్జర్ హత్య వెనుక భారత్ కుట్ర వుందంటూ ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి.తాజాగా ట్రూడో ప్రకటన దీనికి బలం చేకూర్చినట్లయ్యింది.ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాలో ఎప్పుడు ఏం జరుగుతోందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే కెనడా ప్రధాని వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది.
అయితే అమెరికాలో( America ) ఖలిస్తాన్ ఉద్యమానికి ఇక్కడి సమాజంలో ఎలాంటి మద్ధతు లేదని ఇండో అమెరికన్ సిక్కు నాయకుడు, సిక్స్ ఆఫ్ అమెరికా సంస్ధకు చెందిన జెస్సీ సింగ్( Jassee Singh ) తెలిపారు.మాదక ద్రవ్యాలతో పాటు పంజాబ్ ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.సిక్కులతో మోడీ ప్రభుత్వానికి వున్న సత్సంబంధాలు, ఈ కమ్యూనిటీ కోసం ఆయన చేసిన పనులు గత ప్రభుత్వాలతో పోలిస్తే అపూర్వమైనవని జెస్సీ సింగ్ ప్రశంసించారు.
ఇదే సమయంలో అనేక సిక్కు సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం వుందని, 1984లో సిక్కులపై జరిగిన దురాగతాలను , ఏ సిక్కు మతస్తుడు మరిచిపోడని ఆయన పేర్కొన్నారు.
అయినప్పటికీ సిక్కులలో ఎక్కువమంది ఖలిస్తాన్ ఉద్యమానికి మద్ధతు ఇవ్వడం లేదని జెస్సీ సింగ్ స్పష్టం చేశారు.అలాగే సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు భారత్ కుట్ర పన్నిందంటూ ఇటీవల అమెరికా చేసిన ఆరోపణలపైనా ఆయన స్పందించారు.
దీర్ఘకాలంలో ఇది ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం లేదని జెస్సీ సింగ్ వెల్లడించారు.