కలర్స్ స్వాతి( Swathi Reddy ).యాంకర్ గా, యాక్టర్ గా హీరోయిన్ గా పలు రకాల భిన్నమైన పాత్రల్లో స్వాతి నిన్న మొన్నటి వరకు బిజీగానే ఉంది.
ఆ మధ్య కాలంలో ఒక ఎన్ఆర్ఐ వ్యక్తిని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితాన్ని ఫుల్ ఫీల్ చేసుకుంది.కానీ పలు కారణాల వల్ల ఆమె తన భర్తతో విడిగా ఉంటుంది అనే రూమర్స్ ఎక్కువగా వినిపించాయి.
ప్రస్తుతం కెరియర్ పరంగా రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించి మళ్ళీ ఈవెన్ గా బిజీ అవ్వాలని నిర్ణయించుకుంది.మొన్నటికి మొన్న ఒక చిత్రంలో నటించిన అది పెద్దగా వర్కౌట్ అవలేదు ప్రస్తుతం ఆమె వరుస సినిమాల్లో అవకాశాలు సంపాదించుకునే పనిలో ఉంది.
అయితే కలర్స్ స్వాతి తెలుగు విషయంలో చాలా పూర్ కొన్ని వార్తలు అప్పట్లో ప్రముఖంగా వినిపించేవి.

స్వాతికి తెలుగు రాదు ఆమె ఎక్కువగా మాట్లాడలేదు.పైగా కలర్స్ అనే ప్రోగ్రాం( Colours ) స్టార్ట్ చేసిన తర్వాతే తెలుగు మాట్లాడడం నేర్చుకుంది.అంతకు ముందు ఆమె హిందీ, ఇంగ్లీష్ ని ఎక్కువగా ఇంట్లో మాట్లాడుతారు కాబట్టి అవే భాషను పూర్తిగా మాట్లాడేది అట.కానీ ఎప్పుడైతే టెలివిజన్ ఇండస్ట్రీకి అడుగు పెట్టిందో అప్పటి నుంచి తెలుగు మాట్లాడడం తెలుగులో ఎక్కువగా వ్యాఖ్యానించడం అర్థం చేసుకోవడం బదులు ఇవ్వడం వంటివి నేర్చుకుని ఇప్పుడు తన డబ్బింగ్ తానే చెప్పుకుంటుంది.వాస్తవానికి ఆమె చిన్న పిల్లలా మాట్లాడుతుంది.
ఈ వయసులో కూడా ఆమె చాలా క్యూట్ గా చిన్నపిల్లలతో మాట్లాడుతున్నట్టుగానే సమాధానాలు చెబుతుంది.

దానికి కారణం ఆమె సోవియాట్ యూనియన్( Soviet Union ) లో పుట్టడమే అట.అక్కడ ఆమెకు ఎవరూ తెలుగులో మాట్లాడకపోవడం వల్ల తెలుగు ఏ మాత్రం వచ్చేది కాదట.ఇప్పటికీ ఆమె తెలుగులో కొంత మార్పు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం కాదని చెబుతోంది స్వాతి.
తనకు తెలుగు నేర్పిన వారందరికీ ధన్యవాదాలు కూడా చెబుతోంది.జల్సా సినిమాలో డబ్బింగ్ టైంలో మరింత క్యూట్ గా మాట్లాడమని ఇంకా చిన్న పిల్లల వ్యవహరించమని డైరెక్టర్ చెప్పేవాళ్లట.
అందువల్ల తన భాష పెద్దగా మారక పోగా తెలుగు పూర్తిగా రాలేదని కానీ ఇప్పుడు కొంచం పరవాలేదు అని చెబుతోంది.







