యానిమల్ సినిమా( Animal movie ) ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్ దిశగా దూసుకు పోతుంది.తెలుగు దర్శకుడు సందీప్ వంగ ( Sandeep Reddy Vanga )దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా వెయ్యి కోట్ల కి అతి చేరువలో ఉంది.
వచ్చే వీకెండ్ వరకు సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.అయితే యానిమల్ ఫ్రెష్ గా క్రియేట్ చేసిన రికార్డులు అన్ని కూడా రెండు వారాల్లోనే బ్రేక్ అవ్వబోతున్నాయి అంటూ ప్రభాస్ అభిమానులు నమ్మకంగా అంటున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ప్రభాస్ హీరో గా నటించిన సలార్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఏడాది కాలంగా ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.తెలుగు తో పాటు సలార్ ( Salaar )అన్ని భాష ల్లో కూడా విపరీతమైన బజ్ ను క్రియేట్ చేసింది అనడంలో సందేహం లేదు.అందుకే ఓపెనింగ్ వసూళ్లు దాదాపుగా మూడు వందల కోట్లు ఉంటాయి అంటున్నాయి.
ఇక మొదటి వారంలో సలార్ సినిమా కచ్చితంగా 500 నుంచి 600 కోట్ల వరకు వసూళ్లు చేసినా కూడా ఆశ్చర్యం లేదు.
పోటీగా డంకీ ఉన్నా కూడా సలార్ కి ఏమాత్రం డోకా లేదు అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ అంటున్నాడు.ఇక సలార్ వచ్చిన వెంటనే తాజాగా యానిమల్ క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ కూడా కచ్చితంగా బ్రేక్ అవ్వబోతున్నాయి అంటూ సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.సలార్ సినిమా లో ప్రభాస్ ను రెండు విభిన్నమైన గెటప్స్ లో చూడబోతున్నాం.
అంతే కాకుండా సినిమా లో మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి.కనుక సలార్ సినిమా తో యానిమల్ సినిమా యొక్క రికార్డులు బ్రేక్ అవ్వక తప్పదు అంటున్నారు.