స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.బాలయ్య బాబీ కాంబో మూవీ థియేట్రికల్ హక్కులు 100 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.
మరోవైపు బాలయ్య మరో యాడ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.ఈ యాడ్ కు బాలయ్య భారీ స్థాయిలో ఛార్జ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.
బాలయ్యకు యాడ్స్ ద్వారా కూడా ఊహించని స్థాయిలో ఆదాయం వస్తోంది.పఠాన్ చెరులో( Patancheru ) ప్రారంభమయ్యే షాపింగ్ మాల్ కు( Shopping Mall ) సంబంధించిన యాడ్ లో బాలయ్య కనిపించనున్నారని తెలుస్తోంది.
ఈ యాడ్ కోసం బాలయ్య 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఛార్జ్ చేశారని తెలుస్తోంది.బాలయ్య రెమ్యునరేషన్( Balayya Remuneration ) లెక్కలు తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతూ ఉండటం గమనార్హం.

వరుస ప్రాజెక్ట్ లతో క్రేజ్ ను సొంతం చేసుకుంటున్న బాలయ్య ఈ సినిమాలతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది.బాలయ్య మాస్ సినిమాలతో పాటు క్లాస్ సినిమాలకు సైతం ఓటేస్తుండగా బాలయ్య అన్ స్టాపబుల్( Unstoppable With NBK ) ప్రోమో తాజాగా విడుదలైంది.సుహాసిని, హరీష్ శంకర్, శ్రియ, జయంత్ సి పరాన్జీ గెస్ట్ లు హాజరైన ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

బాలయ్య సినిమాలకు సైతం కళ్లు చెదిరే రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.బాలయ్య పారితోషికం ప్రస్తుతం 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా వరుస విజయాలు బాలయ్య స్థాయిని పెంచాయి.2024లో బాలయ్య మరిన్ని విజయాలతో సత్తా చాటుతారేమో చూడాలి.బాలయ్య మాస్ మసాలా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండగా పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి బాలయ్య ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.







