తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున( Nagarjuna ) ఒక స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు.ప్రస్తుతానికి ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
ఇక అందులో భాగంగానే 2023 వ సంవత్సరంలో ఆయన ఒకటి రెండు సినిమాలు రిలీజ్ చేస్తారు అని అనుకున్నప్పటికీ ఆయన ఈ ఇయర్ లో ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులను పలకరించలేదు ఎందుకంటే ఇంతకుముందు వరుసగా ప్లాప్ లు రావడంతో ఆయన కొంచెం సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.అందులో భాగంగానే ఇప్పుడు కొన్ని మంచి సినిమాలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక తను సినిమాల కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నట్టుగా వార్తలు కూడ వస్తున్నాయి.అందుకు తగ్గట్టుగా ఇక మీదట రాబోయే సినిమాల కథలు( Movie Stories ) చాలా బాగా ఉండే విధంగా చూసుకుంటున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఆ ఉద్దేశంతోనే అతను స్క్రిప్టుల మీద ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు గా తెలుస్తుంది.ఇక ఇది ఒకటైతే ఆయన కొడుకులు అయిన నాగ చైతన్య,( Naga Chaitanya ) అఖిల్( Akhil ) ఇద్దరు కూడా సినిమాల్లో పెద్దగా రాణించకపోవడం చూసిన నాగార్జున తట్టుకోలేకపోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.
ఇక నాగచైతన్య కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ అఖిల్ మాత్రం చాలా దారుణంగా తయారయ్యాడు.సినిమా సినిమాకి భారీ డిజాస్టర్ ని అందుకుంటూ మార్కెట్ మొత్తాన్ని డౌన్ చేసుకుంటున్నాడు.ఇక ఇలాంటి సందర్భంలో ఆయనకు ఇప్పుడు ఒక హిట్టు కనక పడకపోతే హీరోగా ఆయన సినిమా కెరీయర్ అనేది చాలా వరకు డల్ అవుతుంది.ఇక ఈ విషయం మీదనే నాగార్జున ఎక్కువ బాధ పడుతున్నట్లుగా తెలుస్తుంది.
ఇక అఖిల్ కి అన్ని ఉన్నప్పటికీ హిట్ ఎందుకు రావడం లేదు అనేది మాత్రం ఎవరికి తెలియడం లేదు.అయితే అఖిల్ తో ఒక మంచి సినిమా చేయడానికి ఒక మంచి కాంబో ని సెట్ చేసే పనిలో నాగార్జున ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదే క్రమంలో తన సినిమాని కొంచెం హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది…
.