యాదాద్రి భువనగిరి జిల్లా:ఓ గ్రామ సర్పంచ్ నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం,కలిసి తమ బాధలు చెప్పుకోవడం తెలంగాణ రాష్ట్రంలో కళ్ళతో చూస్తామా అనుకునే రోజులు పోయాయి,కామన్ మ్యాన్ కూడా ప్రజావాణిలో సీఎం కలుస్తున్న దృశ్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ),సంస్థాన్ నారాయణపురం మండలం,అల్లందేవి చెరువు గ్రామ సర్పంచ్, సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్వి యాదయ్య గౌడ్( Yadaiah Goud ) సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి, పనిలో పనిగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచులు గ్రామాలలో వైకుంఠధామం, రైతు వేదికలు, గ్రామపంచాయతీ భవనాలు,సిసి రోడ్లు నిర్మాణ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.అభివృద్ధి పరచడంలో కరోన వల్ల రెండు సంవత్సరాలు ఆటంకం కలిగిందని పేర్కొన్నారు.
అదేవిధంగా సర్పంచ్ ల పదవి కాల పరిపాలనను పొడిగించాలని సీఎంను కోరినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలన్ శ్రీనివాస్ రెడ్డి,గణేష్,కవిత, దామోదర్,కొండల్ తదితరులు పాల్గొన్నారు.







