కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న డెవిల్ సినిమా( Devil Movie ) ఈ నెలలోనే రిలీజ్ కి రెడీ అయింది.ఇక ఇదే క్రమంలో ఈ సినిమా సలార్ కి( Salaar ) పోటీగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనే విషయం మీద చాలామందికి క్లారిటీ అయితే లేదు.
సలార్ 22 వ తేదీన వస్తుంటే 29వ తేదీన డెవిల్ సినిమా వస్తుంది.అంటే దాదాపుగా ఒక వన్ వీక్ గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రావడం అనేది విశేషం…ముఖ్యంగా కళ్యాణ్ రామ్ అంటే డెవిల్ అనే ఒక కొత్త రకం సినిమాను చేసి మంచి గుర్తింపు పొందాలనే ఆశతో చాలా ఆసక్తితో ఉన్నాడు.
సలార్ సినిమా కనక సక్సెస్ టాక్ తెచ్చుకుంటే డెవిల్ సినిమా పైన ఎఫెక్ట్ చాలా వరకు పడనుందనే విషయం అయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది.డెవిల్ సినిమా కళ్యాణ్ రామ్( Kalyan Ram ) కెరియర్ లో మరో బింబిసారా లాంటి హిట్ అవుతుందని అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.కానీ ఏ సినిమా ఎలా ఉన్నా కూడా రిలీజ్ అనేది కరెక్ట్ టైం లో చేయాలి అనేది చాలా రోజుల నుంచి వస్తున్న పద్ధతి

ఇప్పుడు స్టార్ హీరో అయిన ప్రభాస్ కి( Prabhas ) పోటీగా ఈ సినిమాను దింపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇది ప్రభాస్ అభిమానులు గాని సినిమా అభిమానులు గాని కళ్యాణ్ రామ్ మీద కొంతవరకు ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే కళ్యాణ్ రామ్ కి ఇండస్ట్రీలో మంచి పేరుంది ఆయన ఎవరిని ఏమీ అనడు ఆయనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ ఎవరితో విబేధాలు లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు.

కాబట్టి కళ్యాణ్ రామ్ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటాడు కానీ సలార్ కి పోటీగా రావడం వల్ల భారీగా నష్టపోయే అవకాశం ఉంది అంటూ కూడా కళ్యాణ్ రామ్ మీద ఉన్న ఇష్టాన్ని ఇలా రివిల్ చేస్తున్నారు.సినిమా ఫ్లాప్ అవుతుందేమో అనే ఉద్దేశంలోనే అభిమానులు ఇలా తెలియజేస్తున్నారు… చూడాలి మరి రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుంది అనేది…
.







