తెలంగాణలోని బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.గతంలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయలేదని విమర్శించారు.
అవినీతిని నిర్మూలిస్తూ పారదర్శకంగా పని చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.ఈ క్రమంలోనే పేదలకు సంక్షేమం అందేలా పని చేస్తామన్న ఆయన తెలంగాణ విద్యుత్ విభాగంలో రూ.81 వేల కోట్ల అప్పు ఉందని చెప్పారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులను దాచి పెట్టిందన్నారు.
అలాగే మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు కుంగిపోవడానికి సంబంధించి ఎవరు దర్యాప్తు జరపాలనేది మరో రెండు రోజుల్లో నిర్ణయిస్తామని వెల్లడించారు.







