మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.అధికారం పోయిందనే బాధ కేటీఆర్ లో కనిపిస్తుందని తెలిపారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏం జరిగిందో వెలికి తీస్తామని మంత్రి సీతక్క అన్నారు.బీఆర్ఎస్ నేతలకు తొందరపాటు తగదని పేర్కొన్నారు.
తాము ఇచ్చిన హామీలకు వెయ్యి, రెండు వేలు కలిపి ఇస్తామంటూ మీరు కూడా హామీలిచ్చారన్న ఆమె మీరెలా అమలు చేద్దామని హామీలు ఇచ్చారని ప్రశ్నించారు.ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు.
కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు.







