మారుతున్న కాలానికి తగ్గట్లుగా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో సంస్కరణలు తీసుకొస్తోంది కెనడా.( Canada ) మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన విద్య, మంచి ఉద్యోగావకాశాలు వుండటంతో పలు దేశాల విద్యార్ధులు కెనడాకు క్యూ కడుతున్నారు.
అలాగే సరళమైన ఇమ్మిగ్రేషన్( Immigration ) నిబంధనలు, వీసా జారీ, త్వరగా శాశ్వత నివాస హోదా వంటి అనుకూల అంశాలు కెనడా వైపు విద్యార్ధులను ఆకర్షిస్తున్నాయి.కోవిడ్ తర్వాత ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు తీసుకురావడంతో కెనడాకు వలసలు పెరుగుతున్నాయి.
అయితే ప్రస్తుతం గృహ సంక్షోభం, జీవన వ్యయాల పెరుగుదల కారణంగా కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్ధుల రాకపై కొన్ని పరిమితులు విధిస్తోంది.
కొద్దిరోజుల క్రితం జీవన వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీ విద్యార్ధుల( Foreign Students ) రాకపై వున్న నిబంధనలను జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) సర్కార్ మరింత కఠినతరం చేసింది.కాస్ట్ ఆఫ్ లివింగ్ నిబంధన కింద విదేశీ విద్యార్ధులు తమ వద్ద 20,635 కెనడా డాలర్లు (భారత కరెన్సీలో రూ.12.7 లక్షలు) వున్నట్లుగా రిజర్వ్ ఫండ్స్ చూపించాలని పేర్కొంది.గతంలో ఇది 10,000 కెనడియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.6.14 లక్షలు)గా వుండేది.ఏళ్లుగా కాస్ట్ ఆఫ్ లివింగ్ నిబంధనల్లో మార్పులు లేకపోవడంతో కెనడాకు వచ్చే విదేశీ విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. విదేశీ విద్యార్ధులను ఆకర్షించడంతో పాటు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం తమ బాధ్యత అని పేర్కొంది.
ఇకపై ఏటా కాస్ట్ ఆఫ్ లివింగ్( Cost Of Living ) నిబంధనల్లో మార్పులు తీసుకొస్తామని వెల్లడించింది.

అయితే కెనడా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం భారతీయ విద్యార్ధులపై( Indian Students ) తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంటున్నారు.కెనడాలో పెరుగుతున్న జీవన వ్యయాల కారణంగా ఇది విద్యార్ధులకు అదనంగా భారంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కెనడాకు విద్యార్ధి వీసాలు( Canada Student Visa ) కోరుతూ వచ్చే దరఖాస్తుల సంఖ్యపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
కెనడాలో చదువుకుని జీవితంలో మంచి స్థితికి చేరాలని భావిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్ధులకు ఇది శరాఘాతంగా పరిణమిస్తుందని వీసా అండ్ ఐఈఎల్‌టీఎస్ సెంటర్స్ అసోసియేషన్ (ఏవీఐసీ) అధ్యక్షుడు బిక్రమ్ చభల్( Bikram Chabhal ) అన్నారు.

విద్యార్ధుల వలసలు దెబ్బతింటే అది పరిశ్రమ భవిష్యత్తుపైనా ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికే కెనడాకు విద్యార్ధుల వలసలను పరిమితం చేయడాన్ని పరిశ్రమ వర్గాలు ఖండిస్తున్నాయి.డిసెంబర్ 2022 నాటికి కెనడాకు 1.5 లక్షల విద్యార్ధి వీసా దరఖాస్తులు అందితే.ఈ ఏడాది ఆ సంఖ్య 72000 నుంచి 82000కు పడిపోయిందని వారు చెబుతున్నారు.
ఇప్పటికే పరిశ్రమ తిరోగమనాన్ని ఎదుర్కొంటోన్న వేళ .కెనడా కొత్త నిబంధనలుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







