ఈ గాడిద తెలివిని చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. ఏం చేసిందంటే..!

అందరూ ఒక దారిలో వెళ్తే కొందరు మాత్రమే విభిన్న పంథాలో నడుస్తారు.ముఖ్యంగా ఎంతో కష్టంగా అందరూ భావించే పనిని చాలా సులువుగా చేసేస్తుంటారు.

 Clever Donkey Uses Technique To Work Smarter Video Viral Details, Donkey, Talent-TeluguStop.com

దీంతో వారి తెలివిని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు.అయితే ఎంతో సులువుగా చేయాల్సిన పనిని చెడగొడితే, లేదా చేయలేకపోతే పెద్దలు తమ పిల్లలను తెలివి తక్కువ గాడిద అని పిలుస్తారు.

అంటే ఎంతో కాలంగా గాడిదలు( Donkeys ) తెలివి తక్కువ జంతువులని అందరూ భావిస్తున్నారు.గాడిద బరువు మోస్తూ యజమాని చెప్పిన పని చేస్తుందని, దానికి తెలివి ఉండదని చినప్పటి నుంచి మనం చదువుకున్న కథల్లో ఉంది.

అయితే ఆ అపవాదును ఓ గాడిద చెరిపేసింది.

తనలో చాలా తెలివి, సమయస్పూర్తి ఉందని ఆ గాడిద నిరూపించింది.దీనికి సంబంధించిన ఓ వీడియో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కొన్ని గాడిదలు ఒక మార్గం గుండా వెళ్తుంటాయి.అక్కడ దారికి అడ్డంగా ఓ కర్ర( Stick ) కొంత ఎత్తులో ఉంటుంది.

దానిపై నుంచి కొన్ని గాడిదలు దాటుకుని ఆ మార్గంలో వెళ్తున్నాయి.ఒక్కో గాడిద ఆ కర్రపై నుంచి దూకి అవతలకు వెళ్తున్నాయి.

ఇలాగే ఓ గాడిద అక్కడకు వచ్చింది.

అంతకుముందు కొన్ని గాడిదలు కర్రపై నుంచి దూకినట్లు అది చేయలేదు.దారికి అడ్డంగా ఉన్న ఆ కర్రను చూసింది.దూకడం ఎందుకులే అని భావించింది.దాని బుర్రలో చక్కటి ఆలోచన వచ్చింది.దానిని వెంటనే అది అమలు చేసింది.తన నోటితో ఆ కర్రను పట్టుకుని పక్కన పడేసింది.ఆ తర్వాత తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే బాగా వైరల్ అవుతోంది.ఆ గాడిద తెలివిని( Clever Donkey ) చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇక తెలివి తక్కువ గాడిద అని తాము ఎవరినీ పిలవబోమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube