పద్మావతి రెడ్డికి పలు సమస్యలు స్వాగతం...!

సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గం( Kodad Constituency )తో పాటు కోదాడ పట్టణం సమస్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి నూతన కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి( Uttam Padmavathi Reddy )కి సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి.గత పాలకుల చేతిలో నిరాదరణకు గురైన కోదాడ అనేక సమస్యలతోసతమతవుతుంది.

 Many Problems Are Welcome For Uttam Padmavathi Reddy , Uttam Padmavathi Reddy,-TeluguStop.com

ముఖ్యంగా వంద పడకల ఆసుపత్రి గత పాలకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాలేదు.పనులు మొదలు పెట్టలేదు.65వ నెంబర్ జాతీయ రహదారి కోదాడ నియోజకవర్గానికి ఆనుకొని ఉండటం వలన అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.24 గంటల వైద్యం అందక,వైద్యులు అందుబాటులో లేక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు.వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కృషిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.తోపుడు బండ్లు,పూల దుకాణాలు, మటన్ మార్కెట్,కూరగాయల మార్కెట్,వీటన్నిటిని కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ఏర్పాటు చేద్దామని పట్టణంలోని పశువుల సంతలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

అది అదిలోనే ఆగిపోయింది.

నిర్మాణానికి తెచ్చిన సువ్వలు శిథిలావస్తానికి చేరాయి.

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎప్పుడు నిర్మాణం అవుతుందా అని పట్టణ ప్రజలు వేచి చూస్తున్నారు.కోదాడ పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ గా పర్యటకులకు ఆకర్షించే విధంగా ఏర్పాటుచేయాలి.

అంతేకాకుండా పెద్ద చెరువు అక్రమాణాలకు గురికాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.పట్టణ ప్రజలకు సేద తీర్చడానికి పార్కులెంతో అవసరం.

అయితే పద్మావతి నగర్( Padmavati Nagar ) లో ఒకటి,గాంధీ పార్క్ ఒకటి తప్ప పార్కులేవు.ట్రాఫిక్ సమస్యలతో పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పనిచేయడం లేదంటే ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.గంజాయికి యువత బానిసై పట్టణాన్ని కమ్మేసింది.

గతంలో పట్టణంలోని అంబేద్కర్ కాలనీ సమీపంలో తన కుమారుడు గంజాయి తాగి ఇంటికి రావడంతో చెట్టుకు కట్టేసి కళ్ళల్లో కారం పెట్టి మరీ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే.అంటే గంజాయికి యువత ఎంత బానిస అవుతున్నారో అనే విషయం అర్థం చేసుకోవచ్చు.

గ్రామాల్లో కూడా చాటుమాటుగా ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది.అంతేకాకుండా మునగాల మండల పరిధిలో అనేక గ్రామాలు నాన్ కెనాల్ కింద ఉండి వ్యవసాయం భారంగా మారింది.

ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించాల్సిన అవసరం ఉంది.ఈ సమస్యలను నూతనంగా ఎన్నికైన పద్మావతి రెడ్డి ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి మరి…!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube