నల్లగొండ జిల్లా:గ్రామీణ తపాలా ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిరవధిక సమ్మకు దిగిన విషయం తెలిసిందే.రెండవ రోజు కూడా జిల్లాలో ఉన్న అన్ని పోస్టల్ కార్యాలయాల ముందు కాంట్రాక్ట్ సిబ్బంది నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ 8 గంటల పని మరియు పెన్షన్ తో సహా అన్ని ప్రయోవజనాలను మంజూరు చేయాలని, 2016 నుండి టిఆర్సిఏ రేషనల్ ఫిక్సేషన్ తో సహా కమాలేష్ చంద్ర కమిటీ సానుకూల సిఫారసు అన్నిటిని ఎంటర్ చేసి రెగ్యులర్ ఎంప్లాయిస్ కు ఇచ్చినట్టు వేస్టేజ్ ఇంక్రిమెంట్స్ సీనియర్స్ బంచింగ్ ఇవ్వాలని,12, 24 మరియు 36 సంవత్సరాలలో పూర్తి సర్వీస్ చేసిన వారికి ఆర్థిక ఉన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజీ 5 లక్షల వరకు పెంచాలని, డిపార్ట్మెంట్ స్టాప్ తో సమానంగా జిడిఎస్ గ్రాడ్యూటీ పెంచాలని,రిటైర్డ్ జిడిఎస్ అందరికీ హడాక్ పెన్షన్ మంజూరు చేయాలన్నారు.
అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం ప్రకారం కొత్తగా నియమించబడిన జిడిఎస్ లకు ఐదు గంటల పనికి సెకండ్ టిఆర్ఏ ఇవ్వాలని, రెగ్యులర్ స్టాప్ కి జిడిఎస్ లకు ఇంక్రిమెంట్లు మంజూరు చేయుటలో వాడే విధానం పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బిజినెస్ టార్గెట్ల పేరుతో జిడిఎస్ లను వేధించే అన్ని పద్ధతులను ఆపివేయాలని,జిడిఎస్ ఇష్టానికి వ్యతిరేకంగా సొంత మొబైల్ ఫోన్లను ఉపయోగించాలని ఒత్తిడి చేయడం ఆపేయాలని, ఫేస్బుక్,ఇన్స్ట్రా గాం లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంను అనుసరించాలని బలవంతం పెట్టకూడదని, మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు.