ప్రముఖ బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యాంకర్ సుమ( Suma ) కుమారుడిగా రోషన్( Roshan ) హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.రోషన్ హీరోగా బబుల్ గమ్( Babool Gam ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రోషన్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు.ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీఆర్( Ntr ) రాజీవ్ ( Rajeev)మధ్య ఫ్రెండ్షిప్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
![Telugu Friendship, Jr Ntr, Rajeev, Roshan, Suma, Suma Kanakala, Tollywood-Movie Telugu Friendship, Jr Ntr, Rajeev, Roshan, Suma, Suma Kanakala, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/12/Rajeev-Suma-kanakala-Roshan-Student-No-1-friendship.jpg)
వీరిద్దరి స్నేహం గురించి రోషన్( Roshan ) మాట్లాడుతూ వారిద్దరిది స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ఏర్పడినటువంటి స్నేహబంధం అని నాకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారని అలాంటి ఫ్రెండ్స్ ని ఎప్పుడు వదులుకోకూడదని తెలియజేశారు.ఇక నాన్న ఎప్పుడు చూడు తారక్ అన్న ని చూసి డ్యాన్స్ నేర్చుకో అంటూ నాకు సలహా ఇచ్చేవార.నటనలో నేను కూడా ఆ స్థాయికి వెళ్లాలని నా కోరిక అంటూ రోషన్ తెలిపారు.ఇక వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ వార్తలు రావడం సర్వసాధారణం కానీ అందులో నిజం లేదని వాళ్ళిద్దరు ఎప్పుడు అలా ప్రవర్తించలేదని అలా ఉంటే కదా వాళ్ళు ఫీల్ అవ్వడానికి అంటూ రోషన్ ఈ సందర్భంగా ఎన్టీఆర్ రాజీవ్ కనకాల మధ్య స్నేహబంధం గురించి, గొడవలు క్లారిటీ ఇచ్చారు.
![Telugu Friendship, Jr Ntr, Rajeev, Roshan, Suma, Suma Kanakala, Tollywood-Movie Telugu Friendship, Jr Ntr, Rajeev, Roshan, Suma, Suma Kanakala, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/12/Shahrukh-khan-DunkiVaishno-devi-Bollywood-social-media.jpg)
ఇక ఈ సినిమాలో లిప్ కిస్ సన్నివేశాలు కూడా ఉన్నాయి ఈ సీన్ చేయడం కోసం 150 టేకులు తీసుకున్నారా అంటూ యాంకర్ ప్రశ్నించడంతో ఒక్కసారిగా రోషన్ అక్కడి నుంచి సీరియస్ గా లేసి వెళ్ళిపోయారు.అయితే ఈయన వెళ్లిపోయి హీరోయిన్ ని తీసుకొని వచ్చి ఈ సీన్ కోసం మనం ఎన్ని టేకులు తీసుకున్నామో చెప్పు అంటూ మాట్లాడారు.అయితే ఇదంతా కూడా సరదాగా చేశారని తెలుస్తుంది.ఇలా మొదటిసారి యాంకర్ కుమారుడు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నారు.మరి ఈ సినిమా ద్వారా ఈయన తన తల్లిదండ్రుల లాగే ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.