ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఓవైపు మరోసారి అధికారమే లక్ష్యంగా ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా నియోజకవర్గ ఇంఛార్జ్ లను మార్పు చేసింది.
మరోవైపు వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ పరిణామాల అనంతరం ప్రశాంత్ కిషోర్ టీడీపీతో టచ్ లోకి వెళ్లారని ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ క్రమంలోనే నారా లోకేశ్ ఢిల్లీలో ఉన్న సమయంలో ప్రశాంత్ కిషోర్ పలు విషయాల్లో సలహాలు ఇచ్చారని సమాచారం.
అంతేకాకుండా కన్సల్టెన్సీ తరహాలో కాకుండా ప్రశాంత్ కిషోర్ టీడీపీకి స్వచ్ఛందంగా సలహాలు ఇస్తున్నారని టాక్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.