టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఇండియన్ సూపర్ హీరో సినిమా ‘హను – మాన్‘( Hanu Man ).ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ( Hero Teja Sajja ) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ లుగా నటించారు.
ఈ సినిమా స్టార్టింగ్ లో పెద్దగా అంచనాలు ఏవీ లేవు.కానీ ఆ తర్వాత మాత్రం అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
టీజర్ తో అంచనాలు డబల్ కావడంతో ఈ సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులు కూడా ఎక్కువయ్యారు.అందులోను ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాను పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.
అందుకే ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా వేశారు.

దాదాపు 6 నెలల పాటు వాయిదా వేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను ఈ మధ్యనే స్టార్ట్ చేసి ప్రతీ మంగళవారం ఒక్కో అప్డేట్ ను రిలీజ్ చేస్తున్నారు.ఈ రోజు కూడా మరో అప్డేట్ ఇచ్చారు.

ఎప్పటి నుండో ఆడియెన్స్ అంత ఎదురు చూస్తున్న ట్రైలర్ ( Hanuman Trailer ) అప్డేట్ ఇచ్చారు.డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Director Prashanth Varma ) తెరకెక్కిస్తున్న ఈ భారీ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 19న రిలీజ్ చేస్తామని అఫిషియల్ గా ప్రకటించారు.మరి ఈ ట్రైలర్ తో ఎలాంటి అంచనాలు క్రియేట్ అవుతాయో చూడాలి.కాగా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ( Varalaxmi Sarathkumar ), వినయ్ రాయ్ లు కీలక పాత్రల్లో నటించగా.
అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరబ్ లు సంగీతం అందిస్తున్నారు.ఇక ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు.మరి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఇప్పటికే చాలా పోటీ ఉన్న నేపథ్యంలో హనుమాన్ సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.







