నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది.రూ.20 కోట్ల రుణాన్ని వడ్డీతో చెల్లించాలని మామిడిపల్లిలోని జీవన్ రెడ్డి నివాసానికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు అంటించారని తెలుస్తోంది.
2017వ సంవత్సరంలో భార్య పేరుతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లోన్ తీసుకున్నారని సమాచారం.ఇంతవరకు డబ్బు చెల్లించకపోవడంతో అసలు, వడ్డీ కలిసి రూ.45 కోట్ల బకాయి ఉందని అధికారులు వెల్లడించారు.ఈ మేరకు జీవన్ రెడ్డితో పాటు గ్యారెంటీ సంతకాలు పెట్టిన మరో నలుగురికి అధికారులు నోటీసులు జారీ చేశారు.నిర్ణీత సమయంలో రుణం చెల్లించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.