ముగిసిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం లెక్కలు, భూమి వేలం పాట..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో గల శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం ఇటీవల జరుగగా లడ్డు వేలం పాట తో సహా పలు ఖర్చులను ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో లెక్కలు చూపించారు.గతంలో పలు పర్యాయాలు పనిచేసిన ఆలయ కమిటీ గ్రామ ప్రజలకు లెక్కలు చూపించారు.

 Yellareddypeta Sri Venugopala Swamy Temple Calculations Land Auction, Yellareddy-TeluguStop.com

కానీ ఈ ఏడాది సర్పంచ్ వెంకట్ రెడ్డి నూతన అధ్యక్షుడు గడ్డం జితేందర్ ఆధ్వర్యంలో గల ఆలయ కమిటీ 5,82,220 రూపాయల ఆదాయం రాగ 4,63,520 రూపాయలు రథోత్సవానికి ఖర్చు అయ్యాయి.

కాగ మొత్తం ఖర్చులు పోను 1,18,700 రూపాయలు మిగులు బడ్జెట్ ఆలయానికి మిగిల్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వెంకట్ రెడ్డి జితేందర్, గంట వెంకటేష్ గౌడ్ లను ఆలయ పురోహితులను అభినందించారు.శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కు సంబంధించిన అయిదు ఎకరాల భూమి నారాయణపూర్ శివారులో ఉండగా అట్టి భూమి కోసం వేలం పాట వేయగా ముగ్గురు రైతులు పోటీ పడగా మాస్కురి దేవయ్య 55 వేల రూపాయలకు దక్కించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అద్యక్షులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్, అంటేర్పుల గోపాల్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి బాల్ రెడ్డి,బొప్పాపుర్ మార్కెట్ కమిటీ మాజీ సభ్యులు ఎలగందుల నర్సింలు, ఎలగందుల బాబు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మేగి నర్సయ్య, నేవూరి శ్రీనివాస్ రెడ్డి, గన్న మల్లారెడ్డి,సుంకి భాస్కర్, వర్దవెళ్ళి శ్రీనివాస్ గౌడ్,బందారపు మల్లారెడ్డి, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు అంటెర్పుల ఎల్లయ్య, మ్యాకల శరవింద్, ఎలగందుల సత్యనారాయణ,అల్లం శ్రీకాంత్,ఆరే నర్సింలు,బాధ రాజు తో పాటు రైతులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube