తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది( Hyper Aadi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ షోలో( Jabardasth ) తనదైన శైలిలో పంచులు వేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు.
కేవలం జబర్దస్త్ షోలో మాత్రమే కాకుండా ఢీ,శ్రీదేవి డ్రామా కంపెనీ, పండుగ ఈవెంట్ లలో సందడి చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు హైపర్ ఆది.ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా రాణిస్తున్నాడు.నటుడిగానే కాదు, రాజకీయ నాయకుడిగానూ మారాడు.పవన్ కళ్యాణ్ జనసేనకి ఆయన సపోర్ట్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే హైపర్ ఆదికి నలభై ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదన్న విషయం మనందరికి తెలిసిందే.
ఇప్పటికి పెళ్లి ఊసే ఎత్తడం లేదు.
దాంతో మ్యారేజ్( Marriage ) చేసుకుంటాడా? లేదా అనే డౌట్లు వస్తున్నాయి.అయితే ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తేలిపోయింది.
ఆయన జాతకంలో దోషం ఉందట.ఆ దోషం పోవాలంటే ఒక ఉపాయం చెప్పాడు జ్యోతిష్యుడు.
ఉపాయం ఏంటంటే ముందుగా వృద్ధురాలిని( Old Lady ) పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది.ముసలావిడని పెళ్లి చేసుకున్న తర్వాతనే మళ్లీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని జ్యోతిష్యుడు చెప్పడంతో కంగుతిన్న హైపర్ ఆది ఎట్టకేలకు పెళ్లికి సిద్దమయ్యాడు.
ఆయన కోసం పెళ్లి చూపులు జరిగాయి.వృద్ధురాళ్లు ముగ్గురు నలుగురు వచ్చారు.

మొదట వచ్చిన ఆమె బాగానే ఉంది, కానీ ఆమెని తిరస్కరించాడు హైపర్ ఆది. హనీమూన్ ఎక్కడికి వెళదామంటే బేగం పేట ఆసుపత్రికి వెళ్దామంటూ ఎటకారంగా కామెంట్లు చేశారు.ఆ తర్వాత మరో వృద్ధురాలిని తీసుకొచ్చారు.ఆమె రావడం రావడంతో పాటందుకుంది.హైపర్ ఆది జాతకం మొత్తం చెప్పేసింది.ఆయన ఎలా ఉంటాడో పాట రూపంలో చెప్పి అమ్మా నాకు ఈయన వద్దు అంటూ తెగేసి చెప్పేసింది.
దీంతో ఆదికి, పక్కన ఉన్న రష్మికి( Rashmi ) ఫ్యూజులు ఎగిరిపోయాయి.ఆ తర్వాత మరో బ్యాచ్ దిగింది.
ఇందులో ముగ్గురు లేడీస్ వచ్చారు.

కోట బొమ్మాళి సినిమాలోని( Kotabommali ) లింగిడి లింగిడి పాటకు అదిరిపోయే డాన్సులు వేశారు.అయితే వారి డాన్సులకు ఫిదా అయిన హైపర్ ఆది. అందులో ఒక వృద్ధురాలికి కనెక్ట్ అయ్యాడు ఆమెని చేసుకునేందుకు ఓకే చెప్పాడు.తీరా చూస్తే ఆమె ఆమె కాదు, ఆయన.దీంతో ఆదికే కాదు, అందరికి ఫ్యూజులు ఔట్ అయ్యాయి.అయితే ఇదంతా నిజంగానే అనుకుంటే పొరపాటు పడ్డట్టే.ఇదంతా కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో( Sridevi Drama Company ) జరిగిన ఒక ఈవెంట్.ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







