రెండు వారాలుగా తప్పిపోయిన కుక్క.. దొరికాక దాని క్యాట్ ఫ్రెండ్ రియాక్షన్ ఏంటంటే..

సాధారణంగా కుక్కలు తప్పిపోతే( Dog Missing ) యజమానులు చాలా బాధపడతారు.అవి ఎక్కడున్నాయో అని వెతుకుతూ ఉంటారు.

 Dog Missing For Two Weeks Reaction Of Its Cat Friend When Found Viral Video Deta-TeluguStop.com

తప్పిపోయిన శునకాలు ఏమైనా తిన్నాయా? సరిగా పడుకున్నాయా? లేక ఏదైనా ప్రమాదంలో పడ్డాయా అన్న ఆందోళన యజమానులలో ఎక్కువగా ఉంటుంది.అయితే ఈ బాధ కేవలం యజమానులకు మాత్రమే కాదు వాటితో స్నేహం చేసే పిల్లులకు( Cats ) కూడా ఉంటుందని ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఒక వీడియో చెప్పకనే చెబుతోంది.

@myworld2121 ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు 43 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.“ఈ కుక్క రెండు వారాలుగా తప్పిపోయి చివరికి దొరికింది.ఇంటికి వచ్చాక దాని క్యాట్ ఫ్రెండ్( Cat Friend ) రియాక్షన్ ఇదీ.” అని దీనికి ఒక క్యాప్షన్ జోడించారు.వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మచ్చలు గల ఒక తెల్ల పిల్లి తన వెనుక కాళ్లపై నిల్చని ముందు కాళ్లతో ఒక కుక్కని హత్తుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఉండటం మనం చూడవచ్చు.ఆ పిల్లి చాలాసేపు కుక్కను హత్తుకుంటూ, ముద్దు పెట్టుకుంటూ వాసన చూస్తూ తన ప్రేమను కురిపించింది.

ఆ సమయంలో కుక్క చాలా కామ్ గా తన క్యాట్ ఫ్రెండ్ ప్రేమను ఆస్వాదించింది.

ఈ క్యాట్ ఆ కుక్కతో( Dog ) బాగా అటాచ్ అయినట్లు ఉందని వీడియో చూసిన నెటిజన్లు పేర్కొంటున్నారు.బెస్ట్ ఫ్రెండ్స్, క్యూట్ ఫ్రెండ్స్ అని కొందరు వ్యాఖ్యానించారు.అయితే ఈ పిల్లి ఆ కుక్క సెంటు వాసన చూస్తూ అది తన ఫ్రెండేనా కాదా అనేది నిర్ధారించుకోవడానికి ఇలా చేస్తుందని ఒక యూజర్ పేర్కొన్నారు.

పిల్లులను ఆకర్షించే క్యాట్‌నిప్ప్‌ అనే స్ట్రాంగ్ సెంటు ఈ కుక్కకు పూసినట్లు ఉన్నారు, అందుకే అది ఈ కుక్కను అలా హత్తుకుంటుందేమో అని మరికొందరు సందేహం వ్యక్తం చేశారు.ఏదేమైనా ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది.

దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube