యాదాద్రికి భక్తుల తాకిడి

యాదాద్రి భువనగిరి జిల్లా:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.కార్తీక మాసం చివరి రోజు కావడంతో భక్తులు భారీగా పోటెత్తారు.

 Devotees Rush At Yadadri Temple, Devotees Rush ,yadadri Temple, Sri Lakshmi Nara-TeluguStop.com

తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి మూడు గంటల సమయం పడుతోంది.

భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు నోములు,వ్రతాలు చేసి భక్తపారవశ్యంలో మునిగి పోయారు.స్వామివారి జన్మనక్షత్రం,స్వాతినక్షత్రం కావడంతో విశేష పూజలు అందుకుంటున్నారు.అర్చకులు స్వయంభువులగా కొలిచి కవచ మూర్తులకు అష్టోతర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు.ఆలయ కళ్యాణ మండపంలో 108 కలశాలకు పూజలు చేపట్టారు.

మహిళలకు ఉచితం ప్రయాణం కావడంతో భారీ సంఖ్యలో మహిళలు యాదాద్రికి తరలివచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube