యాదాద్రికి భక్తుల తాకిడి
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.
కార్తీక మాసం చివరి రోజు కావడంతో భక్తులు భారీగా పోటెత్తారు.తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి మూడు గంటల సమయం పడుతోంది.భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు నోములు,వ్రతాలు చేసి భక్తపారవశ్యంలో మునిగి పోయారు.
స్వామివారి జన్మనక్షత్రం,స్వాతినక్షత్రం కావడంతో విశేష పూజలు అందుకుంటున్నారు.అర్చకులు స్వయంభువులగా కొలిచి కవచ మూర్తులకు అష్టోతర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు.
ఆలయ కళ్యాణ మండపంలో 108 కలశాలకు పూజలు చేపట్టారు.మహిళలకు ఉచితం ప్రయాణం కావడంతో భారీ సంఖ్యలో మహిళలు యాదాద్రికి తరలివచ్చారు.