పాలకూర( Spinach ).అద్భుతమైన ఆకుకూరల్లో ఇది ఒకటి.
పోషకాలకు పాలకూర పవర్ హౌస్ లాంటిది అనడంలో సందేహం లేదు.పాలకూరను డైట్ లో చేర్చుకోవడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.
అనేక జబ్బులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అందుకే చాలా మంది పాలకూరను తినేందుకు ఇష్టపడతారు.
పాలకూరతో రకరకాల వంటలు తయారు చేస్తుంటారు.స్మూతీలు, సలాడ్స్, జ్యూసుల్లో కూడా పాలకూరను వాడుతుంటారు.

గుండె పనితీరును పెంచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, రక్తహీనతను తరిమి కొట్టడానికి, కంటి చూపును మెరుగుపరచడానికి పాలకూర అద్భుతంగా సహాయపడుతుంది.అలాగే పాలకూర మన రోగ నిరోధక వ్యవస్థ( Immune System )ను బలోపేతం చేస్తుంది.సీజనల్ వ్యధుల నుంచి మనల్ని రక్షిస్తుంది.పాలకూర వల్ల పలు రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ పాలకూరను అతిగా తింటే మాత్రం ప్రమాదంలో పడినట్టే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది.
పాలకూరను ఓవర్ గా తీసుకుంటే ఆ ఆక్సాలిక్ యాసిడ్. ఐరన్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలను మీ శరీరం తక్కువగా గ్రహించేలా చేస్తుంది.
ఫలితంగా రక్తహీనత, ఎముకల బలహీనత తదితర సమస్యలు తలెత్తుతాయి.

అలాగే పాలకూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.అందువల్ల పాలకూరను అతిగా తీసుకుంటే జీర్ణక్రియ( Digestion ) పై ప్రభావం పడుతుంది.కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఇక కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న వారు పాలకూరను పూర్తిగా ఎవైడ్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.ఎందుకంటే పాలకూర కిడ్నీ స్టోన్స్ సమస్యను మరింత తీవ్ర తరంగా మార్చేస్తుంది.
రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడుతున్న వారు కూడా పాలకూర జోలికి వెళ్లకపోవడం చాలా ఉత్తమం.పాలకూరలో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది.ఇది ఆయా మందుల ప్రభావాన్ని తగ్గించేస్తుంది.







