తెలంగాణ ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.సచివాలయంలోని తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ అండ్ బీ శాఖను కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.చారిత్రక భవనాలను పునరుద్ధరిస్తామని చెప్పారు.
అసెంబ్లీ ఆవరణలో కొత్త కౌన్సిల్ హాల్ నిర్మాణంతో పాటు గాంధీ విగ్రహం ముందున్న ఫెన్సింగ్ తీసేసి సుందరీకరణ పనులు చేపడతామని వెల్లడించారు.