ఛత్తీస్ గఢ్ లో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై చర్చ జోరుగా కొనసాగుతోంది.సీఎం ఎంపిక కోసం బీజేపీ అధిష్టానం పరిశీలకులను నియమించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు ఇవాళ ఛత్తీస్ గఢ్ బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా సీఎం రేసులో కేంద్రమంత్రి రేణుకాసింగ్, రమణ్ సింగ్, అరుణ్ సాహు, ఓపీ చౌదరి, విష్ణుదేవ్ సాయి పేర్లు వినిపిస్తున్నాయి.పరిశీలకులు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన తరువాత సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తారు.
కాగా ఛత్తీస్ గఢ్ లో బీజేపీ మొత్తం 54 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.