తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అధిక ప్రాధాన్యత కల్పించిన విషయం తెలిసిందే.ఇక్కడ నుంచి ముగ్గురు నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఈ క్రమంలోనే ఇవాళ ఉమ్మడి జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు.తొలిసారి మంత్రుల హోదాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లాకు రానున్నారని తెలుస్తోంది.
అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా జిల్లాకు వస్తున్నారు.ఈ మేరకు ముగ్గురు మంత్రులు ఖమ్మం, భద్రాచలం మరియు కొత్తగూడెం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
అయితే మొదటి సారి మంత్రుల హోదాలో వస్తున్న వీరికి అధికార యంత్రాంగంతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.