బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పటి నుండి బిగ్ బాస్ కి ఎవరో ఒకరు దత్త పుత్రిక,దత్తపుత్రుడు లాగా ఉంటారు.అలా ఈసారి బిగ్ బాస్ 7 ( Bigg Boss7 ) లో శోభా శెట్టి బిగ్ బాస్ కి దత్త పుత్రిక గా పేరు తెచ్చుకుంది.
ఈమెపై ఎంత నెగెటివిటీ ఉన్నా కూడా ఎన్ని ఓట్లు తక్కువ వేసినా కూడా 14 వారాల వరకు ఈమెను హౌస్లో నెట్టుకు వచ్చారు.ఇక బయట ఈమెకి విపరీతమైన నెగెటివిటీ ఉంది.
సోషల్ మీడియా( Social media )లో ఈమెపై చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేయడమే కాదు బయటికి వస్తే ఏం చేస్తామో మాకే తెలియదు అనేలా చండాలమైన కామెంట్లు పెడుతున్నారు.ఇక ఇంత నెగిటివిటీ వచ్చినా కూడా బిగ్ బాస్ హౌస్ నుండి ఆమెను ఎలిమినేట్ చేయలేదు.
దాంతో బిగ్ బాస్ మొత్తం ఫేక్ ఓటింగ్ అని ఓట్లు తక్కువ వచ్చిన వారిని హౌస్ లో ఉంచుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేస్తున్నారు అని ఇప్పటికే చాలాసార్లు బిగ్ బాస్ ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు.అంతే కాదు కొంతమంది అయితే బిగ్ బాస్ ని చూడడమే మానేశారు.ఇక హౌస్ లో ఉండే ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకోవడం,రెచ్చగొట్టడం వంటివి చేస్తూ ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది .
కానీ గేమ్స్ లో బాగానే ఆడినప్పటికీ ఓడిపోతే మాత్రం అస్సలు తట్టుకోలేదు.ఇక ఓడిపోతే మాత్రం తన క్లోజ్ ఫ్రెండ్స్ అయినా వారిపై అరుస్తుంది.ఇలా శోభా శెట్టి ఇతరులపై అరుస్తూనే హౌస్ లో ఎక్కువ నెగిటివిటీ సంపాదించుకుంది.
అంతేకాదు ఈమెను బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ చేయకపోవడానికి కారణం కూడా శోభా శెట్టి ( Shobha Shetty ) హౌస్ లో లేకపోతే హౌస్ అంత రసవత్తరంగా ఉండదని ఫలితంగా ఎవరు బిగ్ బాస్ షో చూడరు అనే ఉద్దేశంతోనే ఆమెను ఇన్ని వారాలు కొనసాగించినట్లు తెలుస్తోంది.అయితే 14 వారాలు హౌస్ లో కొనసాగిన శోభా శెట్టి ఈవారం హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది.
ఇక 14 వారాలకి గానూ రెమ్యూనరేషన్ బాగానే తీసుకున్నట్టు తెలుస్తోంది.ఈమె వారానికి రెండు లక్షల చొప్పున 14 వారాలకి 28 లక్షల వరకు సంపాదించినట్టు సమాచారం.