పసుపు పంటలో ఆకుమాడు తెగుల నివారణ కోసం చర్యలు..!

పసుపును( turmaric ) వంటలలో మాత్రమే కాదు వివిధ ఔషధాల, సుగంధ ద్రవ్యాల( Various medicines , spices ) తయారీలో ఉపయోగిస్తారు.మార్కెట్లో పసుపు కు మంచి డిమాండ్ ఉండడంతో పసుపు పంట సాగు విస్తీర్ణం ప్రతి ఏడాది పెరుగుతోంది.

 Actions For The Prevention Of Leaf Blight In Turmeric Crop , Turmaric, Turmeric-TeluguStop.com

రైతులు పంట సాగు చేపట్టి అధిక దిగుబడుల కోసం రాత్రింబవళ్లు శ్రమించకుండా.పంట సాగు విధానంపై అవగాహన కల్పించుకున్న తర్వాత సాగు ప్రారంభిస్తే పెట్టుబడి వ్యయం తగ్గించుకోవడంతో పాటు శ్రమను తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించవచ్చు.

పంటకు ఎలాంటి చీడపీడలు, ఎలాంటి తెగుళ్లు ఏ సమయాలలో ఆశిస్తాయి.వాటిని గుర్తించి సకాలంలో ఎలా నివారించాలి అని తెలుసుకుంటే నష్టం వచ్చే అవకాశం ఉండదని వ్యవసాయ క్షేత్ర నిపుణులు సూచిస్తున్నారు.

Telugu Fungus, Leaf, Turmaric, Turmeric Crop-Latest News - Telugu

పసుపుపంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లలో ఆకుమాడు తెగుళ్లు ( Leaf pests )కీలక పాత్ర పోషిస్తాయి.తెగుళ్లు ఒక ఫంగస్( Fungus ) ద్వారా పంటను ఆశిస్తాయి.గాలి ద్వారా వివిధ మొక్కలకు వ్యాపిస్తుంది.పొలంలో ఉండే అవశేషాలలో ఈ ఫంగస్ జీవించి ఉంటుంది.ఈ ఆకుమాడు తెగుళ్ల లక్షణాలను పసుపు మొక్క ఆకుల దిగువ భాగంలో గుర్తించవచ్చు.పసుపు మొక్క ఆకులపై ఒక మిల్లీమీటర్ వెడల్పుతో దీర్ఘ చతురస్రాకారంలో మచ్చలు ఏర్పడతాయి.

ఈ తెగులు సోకితే మొక్కలు కాలిపోయినట్లుగా కనిపిస్తాయి.పసుపు దిగుబడి చాలా వరకు తగ్గుతుంది.

Telugu Fungus, Leaf, Turmaric, Turmeric Crop-Latest News - Telugu

కాబట్టి పొలంలో ఇతర పంటల అవశేషాలను లేకుండా పూర్తిగా తొలగించాలి.తెగులు సోకిన లేదంటే ఎండిపోయిన మొక్కలను పొలం నుంచి వేరు చేసి కాల్చి నాశనం చేయాలి.మార్పిడి తప్పకుండా చేయాలి.ఈ తెగులు పంటను ఆశించిన తర్వాత నివారణ చర్యలు చేపట్టడం కంటే.సాగుకు ముందే పసుపు కొమ్ములను ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల మాంకొజెబ్ కలిపి ఆ ద్రావణంలో 30 నిమిషాలు నానబెట్టి, నీడలో ఆరబెట్టిన తర్వాత పొలంలో విత్తుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube