కొత్త కారు కొనేవారికి ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కంపెనీ తమ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.ఈ ఆఫర్లు డిసెంబర్ నెల వరకు మాత్రమే.
ఏఏ కార్లపై భారీ డిస్కౌంట్ లు ఉన్నాయో ఒకసారి చూద్దాం.టాటా మోటార్స్ కంపెనీ డిసెంబర్ 31, 2023 వరకు టాటా హరియర్, సఫారీ, ఆల్ట్రోజ్, టియాగో, టిగొర్ లపై ఊహించని డిస్కౌంట్లు ప్రకటించింది.
ఆ వివరాలు ఏమిటో చూద్దాం.
టాటా సఫారీ:( Tata Safari ) ఈ కారుపై గరిష్టంగా రూ.1.40 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు.సఫారీ మ్యానువల్, ఆటోమేటిక్, ఏడీఏఎస్ వేరియంట్ లపై క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.ఎక్సైజ్ ఆఫర్లో భాగంగా రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.కార్పొరేట్ డిస్కౌంట్ లో భాగంగా రూ.15 వేల డిస్కౌంట్ లు అందుబాటులో ఉన్నాయి.
టాటా హారియర్:( Tata Harrier ) ఈ కారుపై గరిష్టంగా రూ.1.35 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు.రూ.50 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.25 వేల నుంచి రూ.50వేల వరకు ఎక్సైజ్ ఆఫర్.ప్రస్తుత జెన్ పై రూ.10 వేల కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు.

టాటా టియాగో, టిగోర్:( Tata Tiago, Tigor ) ఈ కార్లపై గరిష్టంగా రూ.80 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.ఈ కార్లపై క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ.30 వేల నుంచి రూ.60వేల వరకు తగ్గింపు పొందవచ్చు.రూ.15 ఎక్స్చేంజ్ డిస్కౌంట్, రూ.5వేల కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు.

టాటా ఆల్ట్రోజ్:( Tata Altroz ) ఈ కారుపై గరిష్టంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.క్యాష్ డిస్కౌంట్ రూపంలో పదివేల నుంచి రూ.30 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.ఎక్సేంజ్ ఆఫర్ రూపంలో రూ.10వేల నుంచి రూ.25 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.రూ.5 వేల కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు.ఈ ఆఫర్లన్నీ డిసెంబర్ 31, 2023 వరకు అందుబాటులో ఉంటాయి.కొత్త కార్ కొనాలి అనుకునే వారికి ఇదే మంచి అవకాశం అని కంపెనీ తెలిపింది.







