మార్కెట్లోకి ప్రతిరోజు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు( Smart Phones ) విడుదల అవుతూనే ఉంటాయి.ఎవరైనా కొత్త ఫోన్ కొనాలనుకుంటే పాత ఫోన్ ను ఎవరికైనా అమ్మడం లేదంటే ఎక్సేంజ్ ఆఫర్( Exchange Offer ) ద్వారా కొత్త ఫోన్ కొనుగోలు చేస్తారు.
అయితే పాత స్మార్ట్ ఫోన్ అమ్ముతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.స్మార్ట్ ఫోన్లు మార్చడానికి సరికొత్త ఫీచర్లు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ లేదా సరదాగా మారుస్తుంటారు.
కొత్త ఫోన్ తీసుకుంటే ఇక పాత ఫోన్ అమ్మేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం.పాత స్మార్ట్ ఫోన్ లో ఉన్న అన్ని బ్యాంకింగ్ యాప్ లను ( Banking Apps ) డిలీట్ చేసారో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి.

ఎందుకంటే ఈ యాప్స్ మొబైల్ నెంబర్ కు లింక్ అయి ఉంటాయి.ఈ యాప్ లో మిగిలి ఉన్న ఏదైనా డేటా వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు ఎదురుకావచ్చు.మెసేజెస్, కాల్ రికార్డ్స్ లాంటివి అన్ని డిలీట్ చేయాలి.కాంటాక్ట్ నెంబర్స్( Contact Numbers ) అన్ని డిలీట్ చేయాలి లేదంటే బ్యాకప్ చేసి మెయిల్ కు సెండ్ చేసుకోవాలి.
గూగుల్ డిస్క్ లో స్టోర్ చేసుకుని కొత్త ఫోన్ కొనుగోలు చేశాక ఇంపోర్ట్ చేసుకోవచ్చు.ఫోటోలు, వీడియోలు ఇతర మల్టీమీడియా కంటెంట్ ను( Multimedia Content ) బ్యాకప్ చేసేందుకు క్లౌడ్ స్టోరేజీ సొల్యూషన్ ఉపయోగించాలి.

గూగుల్ ఫొటోస్, గూగుల్ డిస్క్, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ అంటివి ఉపయోగించి క్లౌడ్ బ్యాకప్ ను( Cloud Backup ) ఎంచుకోవాలి.స్మార్ట్ ఫోన్ డివైజ్ రీసెట్ చేసేముందు అన్ని గూగుల్ అకౌంట్లు, ఇతర ఆన్లైన్ అకౌంట్ ల నుంచి మ్యానువల్ గా లాగౌట్ చేయడం చాలా అవసరం.ఫోన్ సెట్టింగ్స్ లో లేదా జీమెయిల్ సెట్టింగ్స్ ద్వారా accounts యాక్సిస్ చేయడం ద్వారా లాగిన్ చేసిన అకౌంట్లను తెలుసుకోవచ్చు.ఇలా కావలసిన సమాచారాన్ని మొత్తం బ్యాకప్ చేసుకున్న తర్వాత ఫోన్ సెట్టింగ్ లోకి వెళ్లి రీసెట్ అనే ఆప్షన్ ఎంచుకొని erase all data అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
ఇక స్మార్ట్ ఫోన్ లో ఉండే మొత్తం డేటా డిలీట్ అవుతుంది.







