వైట్ హెయిర్.( White hair ) కోట్లాది మందిని కలవర పెట్టే కామన్ సమస్య ఇది.ఫారిన్ కంట్రీస్ లో కావాలని హెయిర్ డైయింగ్ చేయించుకుని వైట్ గా మార్చుకుంటారు.కానీ మన ఇండియన్స్ మాత్రం తెల్ల జుట్టును ఇష్టపడరు.
ఎందుకంటే తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం.అందుకే తెల్ల జుట్టు కనిపించగానే తెగ హైరానా పడుతుంటారు.
తెల్ల జుట్టును ( White hair )కవర్ చేసుకునేందుకు కలర్ వేసుకుంటూ ఉంటారు.అయితే కృత్రిమ రంగులు జుట్టు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.
హెయిర్ గ్రోత్ ను దెబ్బ తీస్తాయి.
కానీ, ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని కనుక ట్రై చేస్తే సహజంగానే బ్లాక్ హెయిర్ పొందవచ్చు.పైగా ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఐదు నుంచి ఆరు బాదం పప్పులు,( Almonds )రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, గుప్పెడు ఉల్లిపాయ తొక్కలు, రెండు స్పూన్లు అల్లం పొడి ( Ginger powder )వేసి వేయించుకోవాలి.
అన్ని పదార్థాలు పూర్తిగా నల్లగా మారేంత వరకు ఫ్రై చేయాలి.ఆ తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి.
అలాగే అర కప్పు కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఒక రోజంతా గ్లాస్ జార్ ను వదిలేయాలి.
అనంతరం ఏదైనా బ్రష్ సహాయంతో ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే మీ తెల్ల జుట్టు ( White hair )సహజంగానే నల్లగా మారుతుంది.ఈ ఇంటి చిట్కాను పాటిస్తే కలర్స్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
చాలా సులభంగానే నల్లటి కురులను సొంతం చేసుకోవచ్చు.