బొప్పాయి పంటను( Papaya crop ) సాగు చేసే రైతులు పంటను ఆశించే చీడపీడలు, తెగుళ్లు ఏవో తెలుసుకోవడంతో పాటు వాటిని ఎలా నివారించాలో పూర్తి అవగాహన కల్పించుకుంటే మంచి దిగుబడులు సాధించి అధిక లాభాలు అర్జించవచ్చు.
కొంతమంది రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంత శ్రమించినా ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందలేక నష్టాల పాలు అవుతున్నారు.బొప్పాయి పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగించే తెగులలో గోధుమ రంగు మచ్చ తెగులు కూడా ఒకటి.ఈ తెగులు ఒక ఫంగస్ వల్ల పంటకు సోకుతాయి.
ఉష్ణ మండల ప్రాంతాలలో ఈ తెగులు పంటకు సోగడం స్పష్టంగా కనిపిస్తుంది.సాధారణంగా ఈ తెగులు టమాటా పంటను ఎక్కువగా ఆశిస్తుంది.
కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా బొప్పాయి పంటను కూడా ఆశించే అవకాశం ఉంది.
బొప్పాయి మొక్కల ఆకులపై చిన్న గోధుమ రంగు మచ్చలు ముదురు ఆకులపై కనిపిస్తే ఆ మొక్కకు ఈ తెగులు సోకినట్టే.ఈ మచ్చలు క్రమంగా పెరిగి చివరికి బూడిద రంగులోకి మారతాయి.ఆ తరువాత ఆకులకు రంధ్రాలు ఏర్పడతాయి.
పంట దిగుబడి తగ్గడంతో పాటు, పండిన పంట కూడా నాణ్యత లేకుండా చేతికి వస్తుంది.దీంతో రైతు తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సిందే.
బొప్పాయి పంట సాగు చేసే పొలంలో ఎక్కడ కూడా టమాటా, కీరదోస మొక్కలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.పొలంలో ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేస్తుండాలి.
ఈ తెగులను సేంద్రీయ పద్ధతిలో అరికట్టాలంటే.సిలోన్ సిన్నమన్ నూనె 0.52 ml ఉపయోగించి తెగులను నివారించవచ్చు.సేంద్రీయ పద్ధతిలో ఈ తెగులను అరికట్టాలంటే.
క్లొరోతలోనిల్, మాంకోజెబ్ లాంటి పిచికారి మందులను ఉపయోగించి నిరోధించవచ్చు.