తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం రేపటి నుంచి అమల్లోకి రానుంది.ఈ మేరకు ఫ్రీ బస్సు జర్నీ స్కీం విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో రేపటి నుంచే రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ సర్కార్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ, పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచితంగా ప్రయాణించవచ్చు.ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీకి అయ్యే ఖర్చును ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ చేయనుంది.