ఇటీవలే జరిగిన ప్రపంచ కప్ కు( World Cup ) భారత్ ఘనంగా ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొన్న జట్ల ఆటగాళ్లకు భద్రతతో పాటు వారి ప్రాక్టీస్ కు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించిన విషయం తెలిసిందే.
భారత్( India ) ఘనంగా ఇచ్చిన ఆతిథ్యం గురించి టోర్నీలో పాల్గొన్న జట్లన్నీ గొప్పగా చెప్పాయి.ఇక ఫైనల్ మ్యాచ్లో( Final Match ) స్టేడియంలో ప్రత్యేక షోలతో అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కల్పించింది భారత్.
అయితే ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్ లు జరిగిన పిచ్ లకు( Cricket Pitch ) తాజాగా ఐసీసీ( ICC ) ఇచ్చిన రేటింగ్ చూసి బీసీసీఐ షాక్ అయింది.భారత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ పిచ్ కు ఐసీసీ యావరేజ్ రేటింగ్ పాయింట్లు ఇచ్చింది.
ప్రపంచ కప్ టోర్నీలో రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగిన కోల్ కత్తా పిచ్ కు కూడా యావరేజ్ రేటింగ్ పాయింట్లు ఇచ్చింది.

ప్రపంచ కప్ లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్( India vs New Zealand ) మ్యాచ్ జరిగిన వాఖండే పిచ్ కు( Wankhede Pitch ) ఐసీసీ గుడ్ రేటింగ్ పాయింట్లు ఇచ్చింది.ప్రపంచ కప్ లో భారత జట్టు ఆడిన 11 మ్యాచ్లలో మొత్తం ఐదు పిచ్ లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇవ్వడంతో.షాకైన బీసీసీఐ.
ఆ యావరేజ్ రేటింగ్ పిచ్ లు ఏవో చూద్దాం.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ పిచ్, భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఈడెన్ గార్డెన్స్ పిచ్, భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన లక్నో పిచ్, భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన అహ్మదాబాద్ పిచ్, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన చెన్నై పిచ్.







