తండ్రి దెబ్బలు తట్టుకోలేక మూడేళ్ల చిన్నారి మృతి..!

మనిషి కొన్నిసార్లు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా కొన్ని పనులు మాత్రం కుటుంబాలలో తీరని విషాదాలను నింపుతాయి అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

 A Three-year-old Girl Died Because She Could Not Withstand The Blows Of Her Fath-TeluguStop.com

ఓ మూడేళ్ల పిల్లాడిని తండ్రి ఎంత బుజ్జగించినా వినకపోవడంతో.తండ్రి చితకబాదితే ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ చిన్నారి ప్రాణాలు వదిలిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

వివరాల్లోకెళితే.కర్నూలు జిల్లా( Kurnool ) మంత్రాలయం మండలం గూడూరు గ్రామానికి చెందిన లలితమ్మకు సి.బెళగల్ మండలం రంగాపురం గ్రామానికి చెందిన శివకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది.వీరికి నాలుగేళ్ల ప్రణయ్, మూడేళ్ల సంజూ, ఆరు నెలల పాప సంతానం.ఈ దంపతులు బతుకు తెరువు కోసం మహేశ్వరం( Maheshwaram )లోని అమీర్పేటకు వలస వచ్చారు.

శివ ( Shiva )మేస్త్రి పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.</br

అయితే శివ బుధవారం రోజు బయటకు వెళ్లిన తర్వాత అతని భార్య లలితమ్మ ఆరు నెలల పాప, పెద్ద కుమారుడు ప్రణయ్ తో కలిసి కూరగాయలు కొనేందుకు మార్కెట్ కు వెళ్ళింది.

మూడేళ్ల కుమారుడు సంజూ ఒక్కడే ఇంట్లో నిద్రపోతున్నాడు.కాసేపటి తర్వాత శివ ఇంటికి వచ్చి తలుపులు తీయగా సంజూ నిద్రలేచి బయటకు వచ్చాడు.

శివ తన కొడుకు సంజూ ను ఎంత బుజ్జగించిన వినకపోవడంతో ఇంటి లోపలికి తీసుకువచ్చి చితకబాదాడు.దీంతో తండ్రి దెబ్బలు భరించలేక ఆ పసివాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.

కుటుంబ సభ్యులంతా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.అయితే భార్య లలితమ్మ( Lalithamma ) పై అనుమానంతోనే శివ ఈ దారుణానికి పాల్పడ్డాడని లలితమ్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube