జుట్టు ఆరోగ్యానికి అండగా తులసి.. ఇలా వాడితే చుండ్రు ప‌రార్‌!

తులసి మొక్కను మన భారతీయులు ఎంతో పవిత్రంగా చూస్తారు.ప్రతి ఒక్కరి ఇంటి పెరట్లో తులసి మొక్కను నాటి పూజలు చేస్తారు.

 How To Get Rid Of Dandruff With Basil Leaves, Basil Leaves, Basil Leaves-TeluguStop.com

తులసి ఆకుల్లో ఎన్నో పోషకాలు మరియు ఔషధ గుణాలు నిండి ఉంటాయి.ఆరోగ్యపరంగా తులసి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుందని అందరికీ తెలుసు.

అయితే జుట్టు ఆరోగ్యానికి కూడా తులసి అండ‌గా నిలుస్తుంది.తులసి ఆకులను( Basil leaves ) ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే చుండ్రు సమస్య( Dandruff problem ) పరార్ అవ్వడమే కాకుండా మరెన్నో లాభాలు చేకూరుతాయి.

మరింతకీ జుట్టుకు తులసి ఆకులను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Basil, Basil Pack, Dandruff, Care, Care Tips, Fall, Pack, Healthy, Thick-

ఒక కలబంద ఆకును తీసుకుని శుభ్రంగా వాట‌ర్ తో కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ప‌ది నుంచి ప‌దిహేను ఫ్రెష్ తులసి ఆకులు వేసుకోవాలి.అలాగే అలోవెరా జెల్ ( Aloe vera gel )మరియు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ( Curd )వేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ( Olive oil )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Basil, Basil Pack, Dandruff, Care, Care Tips, Fall, Pack, Healthy, Thick-

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే దెబ్బకు పరార్ అవుతుంది.

అలాగే స్కాల్ప్ లోతుగా శుభ్రం అవుతుందికురులు ఆరోగ్యంగా మారతాయి.స్ట్రాంగ్ గా తయారవుతాయి. జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడుగ్గా పెరగడం ప్రారంభం అవుతుంది.అలాగే ఈ తులసి హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల తలలో దురద, ఇన్ఫెక్షన్ వంటివి ఏమైనా ఉంటే నయం అవుతాయి.

మరియు జుట్టు షైనీగా సైతం మెరుస్తుంది.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube