తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు.ఈ క్రమంలో ఆయనకు సీఎస్ శాంతికుమారి, రాష్ట్ర డీజీపీ రవి గుప్తా ఘన స్వాగతం పలికారు.
తరువాత సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అలాగే వేద పండితుల ఆశీర్వాదం అందించగా సచివాలయ సిబ్బంది, పోలీసులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఇతర మంత్రులు కూడా సచివాలయానికి వచ్చారని తెలుస్తోంది.మరి కాసేపటిలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరగనుంది.







