మంచు మనోజ్( Manoj ) రెండవ వివాహమైన తర్వాత ఈయన తన వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా వృత్తిపరమైన జీవితంలో కూడా బిజీ అవ్వబోతున్నారు ఒకవైపు సినిమాలకు కమిట్ అవుతూనే మరోవైపు ఈయన బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నారు.ఈ క్రమంలోనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణంలో ఉస్తాద్ ( Ustad ) అనే టాక్ షో ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ కార్యక్రమంలో సెలెబ్రెటీలు పాల్గొని సందడి చేయబోతున్నారు.ప్రతివారం ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.
ఇక ఈ కార్యక్రమం లాంచింగ్ ఈవెంట్ లో భాగంగా మంచో మనోజ్ ( Manchu Manoj ) మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.తాను తన వ్యక్తిగత కారణాలవల్ల సుమారు 7 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని తెలిపారు.అయితే ఏడు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి నేను మౌనిక రెడ్డి( Mounika reddy )తో ఏడడుగులు వేసిన తర్వాత ఇలా ఇండస్ట్రీకి రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈయన తెలియజేశారు.ఇలా తాను ఇండస్ట్రీకి దూరమైన నాపట్ల అభిమానులు చూపించే ప్రేమ ఏమాత్రం తగ్గలేదని తెలిపారు.
ఇక ఉస్తాద్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రతివారం ప్రసారమవుతుందని ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు అందరూ కూడా హాజరు కాబోతున్నారని ఇంతకుమించి నేనేమి చెప్పనని ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రసారమైనప్పుడు మీకే తెలుస్తుంది అంటూ మనోజ్ తెలిపారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్య టాప్ షో గురించి కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురవుతూ ఆ టాక్ షో తరహాలో ఈ కార్యక్రమం ఉంటుందని అనుకోవచ్చా అంటూ ప్రశ్నించారు.దీంతో బాలయ్య గారు మహావృక్షం లాంటివారు ఆయనతో మాకు ఎలాంటి పోలికలు లేవంటూ మనోజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
.