భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో చివరి వరకు పోరాడిన భారత్ 38 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.భారత జట్టు ప్లేయర్ షెఫాలీ వర్మ( Shafali Verma ) అర్థ సెంచరీ తో పోరాడిన మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం లేకపోవడం వల్ల భారత్ టీ20 సిరీస్ ను ఓటమితో మొదలుపెట్టింది.

ఈ మ్యాచ్లో టాస్ ఓడిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.మ్యాచ్ ఆరంభంలో ఇంగ్లాండ్ బ్యాటర్లను భారత జట్టు బౌలర్ రేణుకా సింగ్ ( Renuka Singh )అద్భుతంగా కట్టడి చేసి సోఫియా డంక్లే (1), అలీస్ క్యాప్సీ (0) అవుట్ చేసి పెవిలియన్ పంపించింది.అయితే సివర్ బ్రంట్ 77, డాని వ్యాట్ 75 పరుగులతో రాణించడం వల్ల ఇంగ్లాండ్ 197 పరుగులు చేయగలిగింది.భారత బౌలర్లు ఇంకాస్త కట్టడి చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది.భారత జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ 52 పరుగులతో రాణించింది.జట్టు కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్( Harmanpreet Kaur ) 26, రిచా ఘోష్ 21 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లంతా ఘోరంగా విఫలం అయ్యారు.వీరితోపాటు స్మృతి మందాన, జేమియా రోడ్రిగస్ రాణించి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.
భారత జట్టులో బౌలింగ్ కాస్త పర్వాలేదు అనిపించిన.బ్యాటింగ్ లో మాత్రం భారీ వైఫల్యాలు కనిపిస్తున్నాయి.
తర్వాతి మ్యాచ్లో భారత్ గెలవాలంటే.బౌలింగ్లో ఇంకాస్త మెరుగు ప్రదర్శన చేస్తూ.
బ్యాటింగ్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణిస్తేనే భారత్ విజయం సాధించే అవకాశం ఉంటుంది.







