Sreekanth : ఆ హీరోతో నటించడం వల్లే నా కెరియర్ నాశనమైంది… శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్?

వెండితెర నటుడిగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు శ్రీకాంత్ ( Sreekanth ) ఒకరు.ఈయన ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

 Y Career Was Destroyed Because Of Acting With That Hero-TeluguStop.com

శ్రీకాంత్ ఎక్కువగా కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలలో నటించి ఈయన ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సంపాదించుకున్నారు.ఇలా హీరోగా 100కు పైగా సినిమాలలో నటించినటువంటి ఈయనకు హీరోగా సినిమాలు సెట్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.

Telugu Career, Kotabommali Ps, Nagachaitanya, Srikanth, Tollywood-Movie

ప్రస్తుతం ఈయన తెలుగు తమిళ భాష చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోలకు బాబాయ్ అన్నయ్య పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఇక శ్రీకాంత్ ఒకవైపు పాజిటివ్ పాత్రలలో నటిస్తూ మరోవైపు నెగిటివ్ పాత్రలలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే శ్రీకాంత్ తాజాగా కోటబొమ్మాలి పిఎస్ ( Kota Bommali PS ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా మంచి ఆదరణ పొందింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీకాంత్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తా

Telugu Career, Kotabommali Ps, Nagachaitanya, Srikanth, Tollywood-Movie

ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే సమయంలో ఎక్కువగా పాజిటివ్ రోల్స్ చేశానని తెలిపారు.అయితే తాను హీరో నాగచైతన్య ( Nagachaitanya ) నటించిన యుద్ధం శరణం అనే సినిమా( Yuddham Sharanam Movie )లో మొదటిసారి నెగిటివ్ పాత్రలో నటించానని తెలిపారు.అయితే నాగచైతన్య సినిమాలో నటించి నేను నా సినీ కెరియర్ ని నాశనం చేసుకున్నాను అంటూ ఈ సందర్భంగా శ్రీకాంత్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో నెగిటివ్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాను అయితే ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక దారుణంగా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలా పడింది.

Telugu Career, Kotabommali Ps, Nagachaitanya, Srikanth, Tollywood-Movie

ఇలా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించినటువంటి తన పాత్రకు కూడా ఏమాత్రం ఆదరణ రాలేదని పైగా శ్రీకాంత్ ( Sreekanth )సాఫ్ట్ మొహానికి ఈ విధమైనటువంటి క్యారెక్టర్లు సూట్ కాలేదు అంటూ అప్పట్లో రివ్యూస్ కూడా వచ్చాయని శ్రీకాంత్ తెలిపారు.ఇక ఈ సినిమా నా కెరియర్ పై చాలా ప్రభావం పడింది.చాలా సంవత్సరాల పాటు సినిమా అవకాశాలు కూడా రాలేదని నాకు తిరిగి ఆఖండ సినిమా మంచి బూస్ట్ ఇచ్చిందని అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు అంటూ శ్రీకాంత్ ఈ సందర్భంగా మాట్లాడారు.ఇక ప్రస్తుతం శ్రీకాంత్ సినిమాల విషయానికి వస్తే ఈయన ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో పాటు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube