మనదేశంలో 1,600 సాలెపురుగు జాతులు ఉన్నాయి.వాటిలో చాలా కొన్ని మాత్రమే విషపూరితమైనవి.
అయితే ఇతర దేశాల్లో మాత్రం ఎక్కువగా విషపూరితమైన జాతులే ఉంటాయి.వీటన్నిటిలో అత్యంత విషపూరితమైన సాలె పురుగు పేరు క్రాబ్ స్పైడర్.
( Crab Spider ) వీటిని ఇసుక సాలెపురుగులు అని కూడా పిలుస్తారు, ఇవి ఆరు కళ్ళు, బలమైన ముందు కాళ్ళను కలిగి ఉంటాయి.ఇవి సికారియస్( Sicarius ) జాతికి చెందినవి, దీని అర్థం లాటిన్లో “హంతకుడు”.
ప్రపంచంలోని అత్యంత విషపూరిత సాలెపురుగులలో( Poisonous Spider ) ఒకటైన ఇవి పెద్ద ఎరను, మానవులను కూడా వాటి డెర్మోనెక్రోటిక్ విషంతో చంపగలవు.వీటి కాటుకు గురైన వెంటనే కణాలు చచ్చిపోతాయి ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి.
ఇవి ఎక్కువగా నమీబియా, దక్షిణాఫ్రికాలో కనిపిస్తాయి.వీటి బాడీ పొడవు 0.6 అంగుళాలు వరకు పెరిగితే, కాళ్ల పొడవు 2 అంగుళాల వరకు పెరుగుతాయి.
ఈ సాలెపురుగులు( Spiders ) తమ ఆహారం దగ్గరగా వచ్చే వరకు వేచి ఉండి, సడన్‌గా అటాక్ చేస్తాయి.తమ నివాసాలను బట్టి వేర్వేరు వేట వ్యూహాలు అమలు చేస్తాయి.వాటిలో కొన్ని చెట్ల ట్రంక్లలో లేదా వదులుగా ఉన్న బెరడు కింద పగుళ్లలో దాక్కుంటాయి, మరికొన్ని నేలపై ఆకు చెత్తలో ఉంటాయి.
అలానే కళ్లను మాత్రమే బయటపెట్టి ఇసుకలో దాక్కునే టెక్నిక్ కూడా ఇవి బాగా వాడుతాయి.కీటకాల ప్రకంపనలను పసిగట్టి వాటిని పట్టుకోవడానికి అధిక వేగంతో ఇసుక నుంచి పైకి వస్తాయి.
ఇసుకలో దాక్కున్న ఈ ఇసుక సాలీడు( Sand Spider ) వీడియోను జెన్నాటెన్నా అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.స్పైడర్ తన కాళ్లను ఉపయోగించి రంధ్రం తవ్వి, ఆపై ఇసుకలో మునిగిపోయిన దృశ్యం వీడియోలో కనిపించడం మీరు చూడవచ్చు.సాలీడు దాదాపు కనిపించకుండా, అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మనం గమనించవచ్చు.ఈ వీడియో చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.